తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న జిల్లాల్లో కృష్ణా గుంటూరు జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి. ఆ పార్టీకి ముందు నుంచి అండగా నిలిచిన కమ్మ, బీసి సామాజిక వర్గాలు ఈ రెండు జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆ పార్టీకి ఒకానొక సమయంలో అండగా ఉన్న కాపు సామాజిక  వర్గం కూడా ఈ రెండు జిల్లాల్లో ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు పార్టీ ఘోర ఓటమిని ఎదుర్కోవడంతో... ఈ రెండు జిల్లాల్లో నానా కష్టాలు పడుతుంది. ఒకప్పుడు చక్రం తిప్పిన జిల్లాల్లో సరైన నేత లేక క్యాడర్ ఇబ్బంది పడుతుంది.

 

గన్నవరం నుంచి వల్లభనేని వంశీ మోహన్ పార్టీ మారిన తర్వాత, నరసరావు పేటలో కోడెల ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఈ రెండు నియోజకవర్గాలకు నెలలు గడుస్తున్నా నియోజకవర్గ బాధ్యతలు ఎవరికి ఇవ్వలేదు అధినేత చంద్రబాబు. దానికి ప్రధాన కారణం క్యాడర్ లేకపోవడమే. ఇన్నాళ్ళు ఆ పార్టీకి సీనియర్ నేతలతో ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు తరం మారడంతో యువత కొత్త తరాన్ని కోరుకుంటున్నారు. 

 

ఈ రెండు జిల్లాల్లో ఒక్క గల్లా జయదేవ్ మినహా ఏ ఒక్కరు కూడా బలమైన నేత లేరు అనేది వాస్తవం. గుడివాడ లాంటి ప్రతిష్టాత్మక నియోజవర్గానికి నానీ తర్వాత ఆ స్థాయిలో సమర్ధత ఉన్న నేతను తెలుగుదేశం తయారు చేయలేకపోయింది అనేది వాస్తవం. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఈ రెండు జిల్లాల్లో ఒకప్పుడు చాలా బలంగా ఉండేది.. కాని ఇప్పుడు నాయకుడు లేక... క్యాడర్ ని సమర్ధవంతంగా నడిపించే నేత లేక ఇబ్బందులు పడుతుంది. 

 

క్యాడర్ ఉందని గర్వంగా చెప్పుకునే ఆ పార్టీ నాయకుడిని మాత్రం తయారు చేయడంలో విఫలమవుతుంది. దీనితో చాలా మంది యువ కార్యకర్తలు పార్టీ మీద ఆసక్తి చూపించడం లేదు. ఏదేమైనా టీడీపీకి కంచుకోట లాంటి ఈ రెండు జిల్లాల్లో పార్టీ త‌ర‌పున ముందుండి న‌డిపించే నాయ‌కుడు లేక‌పోవ‌డం కేడ‌ర్ డిఫెన్స్‌లో ప‌డిపోయేందుకు ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: