విప‌రీత‌మైన ఉత్కంఠ‌... ఊహించని మలుపులు తిరుగుతూ.. ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చిన మహారాష్ట్ర రాజకీయం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చి శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన‌ విషయం తెలిసిందే. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ముఖ్య‌మంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రే సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన‌ప్ప‌టికీ....ఆయ‌న మంత్రివ‌ర్గం కూర్పుపై క్లారిటీ రాలేదు. ఉద్ద‌వ్‌తో పాటు మూడు పార్టీల నుంచి ఇద్దరేసి చొప్పున మొత్తం ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు.  తాజాగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారికి శాఖలను కేటాయించారు. శాఖల కేటాయింపులో ముందుగా ఊహించినట్టుగానే శివసేన కీలకమైన హోం శాఖను దక్కించుకుంది.

 

 

సాక్షిపై ప‌వ‌న్‌కు ఇంత క‌డుపు మంట ఉందా?

 

శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ ‘మహా వికాస్‌ ఆఘాడీ’ సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్‌సీపీ కీల‌క‌నేత అజిత్‌ పవార్‌కు ఆర్థిక శాఖ ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పదవి ఎన్సీపీకి కేటాయించడంతో ఆ బాధ్యతలు అజిత్‌ పవార్‌కు అప్పగించే అవకాశాలున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, అజిత్‌కు ఆర్థిక శాఖ ఇచ్చి తాజాగా జయంత్‌ పాటిల్‌కు ఉప‌ముఖ్య‌మంత్రి ఇస్తార‌ని స‌మాచారం. కాగా, ఇప్పటికే  స్పీకర్‌గా కాంగ్రెస్‌ నేత నానా పటోలే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

నేను ఎమ్మెల్యేగా గెలిచా..నువ్వు ఓడిపోయావు...నాకు నోటీసేంది ప‌వ‌న్‌?


మంత్రులు, శాఖల వివరాలు:

* ఏక్‌నాథ్ షిండే (శివసేన)-హోం, పట్టణాభివృద్ది, పర్యావరణ, పీడబ్య్లూడీ, పర్యాటకం, పార్లమెంటరీ వ్యవహారాలు
* సుభాష్ దేశాయ్ (శివసేన)-పరిశ్రమలు, ఉన్నత, సాంకేతిక విద్య, క్రీడాయువజన మంత్రిత్వ శాఖ
* నితిన్ రావత్ (కాంగ్రెస్)-గిరిజన, ఓబీసీ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ, విపత్తు శాఖ
* బాలా సాహెబ్ థోరట్ (కాంగ్రెస్)-రెవెన్యూ, పాఠశాల విద్య, పశుసంవర్థక, మత్స్యశాఖ
* జయంత్‌పాటిల్ (ఎన్సీపీ)-ఆర్థిక, ప్రణాళిక, గృహనిర్మాణ, ఆహారసరఫరాలు, కార్మిక శాఖ
* ఛగన్ భుజ్‌బల్ (ఎన్సీపీ)-గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయం, జలవనరులు, ఎక్సైజ్ శాఖ

 

మహారాష్ట్రలో పార్టీల బలాబలాలు..

బీజేపీ - 105
శివసేన - 56
ఎన్సీపీ - 54
కాంగ్రెస్ - 44
బహుజన్ వికాస్ అగడి - 3
ఎంఐఎం - 2
ప్రహార్ జనశక్తి పార్టీ - 2
సమాజ్‌వాదీ పార్టీ - 2
ఇతరులు - 13

 

మరింత సమాచారం తెలుసుకోండి: