65 ఏళ్ల వ‌య‌సులో ఎవ‌రైఆనా ఏం చేస్తారు?  కృష్ణా...రామ అనుకుంటూ కాలం గ‌డుపుతుంటారు. లేదంటే ఇంట్లో మ‌న‌వడో...మ‌న‌వ‌రాలితోనూ ఆడుకుంటారు. అయితే, ఈ వ‌య‌సులో ఉన్న ముస‌లోడికి అమ్మాయిల పిచ్చి పుట్టింది. ఇంకే వెంట‌నే అమ్మాయిల జాడ చెప్పే...వాళ్ల జాడ ప‌ట్టుకున్నాడు. ఓ మ‌హిళ‌తో దోస్తీ కుదుర్చుకున్నాడు. కొద్దికొద్దిగా డ‌బ్బులు ఇస్తూ పోయాడు. అలా ఎన్ని డ‌బ్బులు ఇచ్చాడో తెలుసా? ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 73, 50,000. ఇలా 73 ల‌క్ష‌ల యాభైవేలు సొంతం చేసుకున్న త‌ర్వాత ఆ ముస‌లోడికి పోరీలను చూపెట్ట‌డం సంగ‌తి దేవుడెరుగు కానీ పోలీసుల‌కు ప‌ట్టించేందుకు ఆ స్కెచ్ వేసింది.  సంచ‌ల‌నం సృష్టించిన ఈ ఘ‌ట‌న ముంబైలో జ‌రిగింది.

 

నేను ఎమ్మెల్యేగా గెలిచా..నువ్వు ఓడిపోయావు...నాకు నోటీసేంది ప‌వ‌న్‌?

నవీ ముంబయిలోని ఖర్గార్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని 65 ఏళ్ల వృద్ధుడికి ఓ డేటింగ్‌ సెంటర్‌ నుంచి మహిళా ఫోన్‌ చేసింది. తాము  డేటింగ్‌ సర్వీసెస్‌ అండ్‌ స్పీడ్‌ డేటింగ్‌ సెంటర్‌ నుంచి మాట్లాడుతున్నామని వృద్ధుడికి చెప్పింది. `మీరు కోరుకున్న అమ్మాయిని, మీ ప్రాంతానికి పంపిస్తాం` అని వృద్ధుడిని ఉసిగొల్పింది. దీంతో ఆ ముస‌లోడు క‌క్కుర్తి ప‌డ్డారు. త‌న వివ‌రాలు ఇవ్వాల‌ని కోరుకున్నాడు. అయితే, డేటింగ్‌ సెంటర్‌లో పేరు నమోదు చేసుకునేందుకు కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుందని మహిళ చెప్పింది. అప్ప‌టికే మ‌నోడు ఆశ‌తో ఉన్నాడు క‌దా....ఆ మహిళ చెప్పిన విధంగానే రిజిస్ట్రేషన్‌ ఫీజుతో పాటు మరికొంత డబ్బును వారి అకౌంట్‌లో జమ చేశాడు. 

 

సాక్షిపై ప‌వ‌న్‌కు ఇంత క‌డుపు మంట ఉందా?

 

అయితే, ఆ తర్వాత అమ్మాయిలను పంపకపోవడంతో నిరాశ చెందాడు!  తన పేరును డేటింగ్‌ సెంటర్‌ నుంచి తీసేయాలని సదరు మహిళను వృద్ధుడు కోరాడు. ఇక్క‌డ ఇంకో ట్విస్ట్‌. ఆ ముస‌లోడి పేరు డేటింగ్ సైట్ నుంచి తీసివేసేందుకు ఖర్చు అవుతుందని మహిళ వృద్ధుడికి చెప్పింది. అంతటితో ఆగకుండా అమ్మాయిలు కావాలంటూ వృద్ధుడు తమకు ఫోన్‌ చేస్తున్నాడని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వృద్ధుడికి లీగల్‌ నోటీసులు పంపింది. ఇక్క‌డ మ‌ళ్లీ ట్విస్ట్‌. లీగల్‌ సమస్యల నుంచి తప్పించుకోవాలంటే కొంత డబ్బు చెల్లించాలి అని ఆమె వృద్ధుడిని డిమాండ్‌ చేసింది. దీంతో అడ్డంగా ఇరుక్కున్న ముస‌లోడు...ఆమెకు డ‌బ్బులు ముట్ట‌జెప్పాడు. ఒక‌టి కాదు రెండు కాఉద‌..ఏకంగా రూ.73.5 లక్షలను వృద్ధుడి నుంచి మహిళ వసూలు చేసింది. ఇన్ని డ‌బ్బులు వ‌సూలు చేసుకున్న త‌ర్వాత‌...తాను మోసపోయానని  వృద్ధుడు గ్రహించాడ‌ట.

 

దీంతో స‌మీప ఖర్గార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోల్‌కతా కేంద్రంగా ఫేక్‌ డేటింగ్‌ సెంటర్‌ను ముగ్గురు నిర్వహిస్తున్నట్లు తేలింది. స్నేహ(25), ప్రబీర్‌ షా(35), అర్నబ్‌ రాయ్‌(26) అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురిలో ఒకరు మహిళ కాగా, మరొకరు ట్రాన్స్‌జెండర్‌. డేటింగ్‌ పేరిట వృద్ధుడి నుంచి రూ. 73 లక్షలు కాజేజిన ఆ ముగ్గురిని నవీ ముంబయి పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: