సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో, హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ న‌టసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా  తెరకెక్కుతున్న ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా ‘రూలర్’. సోనాల్‌చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ‘రూలర్’ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బాల‌య్య లుక్కు అదిరిపోయిందంటున్నారు. అయితే, బాల‌య్య గురించి అంత‌కంటే హాట్ హాట్ వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. నంద‌మూరి బాల‌కృష్ణ త‌న సొంత ఇంటిని కూల్చివేయ‌నున్నార‌ట‌. అక్క‌డో షాపింగ్ కాంప్లెక్స్ క‌ట్టనున్నార‌ట‌. బాల‌కృష్ణ ఓకే చెప్పిన‌ట్లుగా ప్ర‌చారంలో ఉన్న ఈ నిర్ణ‌యం వెనుక ఉంది ఓ ప్ర‌ముఖుడ‌ట‌.

 

65 ఏళ్ల‌ ముస‌లోడికి పోరీల పిచ్చి..73 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి ఏం చేశాడో తెలుసా?

 

హైద‌రాబాద్‌లో ఇటు ఫిల్మ్‌న‌గ‌ర్ వెళ్లేవారికి...అటు బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట్ వైపు వెళ్లేవారికి...హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ స‌మీపంలో ఉన్న నంద‌మూరి బాల‌కృష్ణ  ఇళ్లు అత్యంత సుప‌రిచితం. సంప‌న్నులు ఉండే ప్రాంతంలో ఉన్న బాల‌య్య ఇంటికి కాలుష్యం, శ‌బ్ధాల బెడ‌ద ఎక్కువే. అయితే, దీన్ని ఎలాగోలా స‌ర్ధుకుంటుండ‌గా మ‌రో అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. అదే రోడ్డు విస్త‌ర‌ణ కోసం అక్కడో ఫ్లై ఓవ‌ర్ నిర్మాణం. దీనికి బాల‌య్య ఇంటికి చెందిన కొంత స్థ‌లం స‌మ‌ర్పించుకోవాల్సి రావ‌డం. 

 

సాక్షిపై ప‌వ‌న్‌కు ఇంత క‌డుపు మంట ఉందా?

 

రోడ్డు విస్త‌ర‌ణ‌లో త‌న ఇంటిలోని స్థ‌లాన్ని అప్ప‌గించ‌డంతో బాల‌య్య ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే వాస్తు కోణంలో బాల‌య్య త‌న ఇంటికి ప‌లు మార్పులు చేయించార‌ట‌. అయితే వాటిని ప‌రిశీలించిన ఓ ప్ర‌ముఖుడు...ఆ మార్పుల వ‌ల్ల క‌లిసి రావ‌డం లేద‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. దీంతో...ఇటు రోడ్డు విస్త‌ర‌ణ‌కు స్థ‌లం ఇచ్చిన‌ట్లు ఉండ‌ట‌మే కాకుండా...అటు వాస్తు ప్ర‌కారం సౌక‌ర్య‌వంతంగా కొత్త ఇల్లు క‌ట్టుకోవాల‌ని బాల‌య్య యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. అందుకే త‌న ప్ర‌స్తుత ఇంటిని కూల్చివేయాల‌ని బాల‌య్య డిసైడ‌యిన‌ట్లు తెలుస్తోంది. 

 

ఇంత‌కీ కూల్చివేసిన త‌ర్వాత ఏం చేస్తారంటే...మంచి సెంట‌ర్లో ఉన్న స్థ‌లం కాబ‌ట్టి అక్కో భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తార‌ట‌. ఇంత‌కీ బాల‌య్య మ‌కాం ఎక్క‌డికి మారుస్తారంట‌రా...ఇప్ప‌టికే భారీ ఇల్లు క‌ట్టుకున్న అగ్ర‌న‌టుడు చిరంజీవి వ‌లే...జూబ్లీహిల్స్‌లోనే సొంత నివాసం ఏర్పాటుచేసుకోవ‌చ్చు లేదంటే...వెంక‌టేశ్ లాగా మ‌ణికొండ వైపు వెళ్లి విశాల‌మైన గృహం నిర్మించుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: