తన రాజకీయ ప్రత్యర్థి హత్య కేసును సిబిఐ కి అప్పగించాలని కోరుతూ,  టీడీపీ నాయకుడు ఒకరు   కోర్టును ఆశ్రయించడం హాట్ టాఫిక్ గా  మారింది. మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు , ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయి , మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ను సిట్ ద్వారా కాకుండా సిబిఐ తో విచారించాలని కోరుతూ టీడీపీ నాయకుడు బిటెక్ రవి హైకోర్టును ఆశ్రయించి కొత్త ట్విస్ట్ ఇచ్చారు .   వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో బిటెక్ రవి కి సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెల్సిందే .

 

 సిట్ విచారణ కు హాజరయిన రవి,  కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగాలంటే  ఈ  కేసును  సిబిఐ కి అప్పగించాలని కోర్టును కోరుతున్నారు . గత ఏడాది మర్చి 15  వ తేదీన  వివేకానంద రెడ్డి ఇంట్లో నిద్రిస్తుండగా ఆయన్ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు . అయితే తొలుత వివేక గుండెపోటు తో మరణించారని చెప్పిన అయన వ్యక్తిగత సహాయకుడు ఆ తరువాత హత్య కు గురయినట్లు చెప్పారు . రక్తపు మడుగులో పడి ఉన్న వివేకాను ఎవరు హత్య చేశారన్న దానిపై పలు రకాల ఊహాగానాలు విన్పించాయి . తీరా ఎన్నికల సమయం కావడంతో టీడీపీ, వైస్సార్ కాంగ్రెస్ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి .

 

 వివేక హత్యను చేధించేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది . ఎన్నికలో టీడీపీ ఘోరంగా ఓటమిపాలుకావడం , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడంతో వివేక హంతకులని వెంటనే అదుపులోకి తీసుకుంటారని అందరూ భావించారు . కానీ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆర్నెల్ల పూర్తయిన ఇంతవరకూ హంతకుల్ని ఎందుకు అదుపులోకి తీసు కోలేదో చెప్పాలంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: