నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి , మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కలిశారు . ఆనం రాంనారాయణ రెడ్డి ఇటీవల సొంత పార్టీ నేతలపైనే చేసిన విమర్శలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెల్సిందే . నెల్లూరు జిల్లా ను మాఫియా , కబ్జాకోరుదారుల చేతిలో పెట్టారంటూ ఆనం రాంనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు . ఆనం .. ఈ వ్యాఖ్యలను మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ని ఉద్దేశించి చేశారన్న ఊహాగానాలు విన్పించాయి .

 

 సొంత పార్టీ నేతలపైనే  రాంనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు , పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించడంతో వెంటనే ఆయనకు  షోకాజ్ నోటీసు జారీ చేయాలని, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ని జగన్మోహన్ రెడ్డి  ఆదేశించారు . ఈ అంశం పై  విజయసాయి  మీడియా తో మాట్లాడుతూ పార్టీ క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించిన సహించేది లేదని చెప్పారు  . ఏదైనా చెప్పాలనుకుంటే పార్టీ వేదిక లో చెప్పాలని అంతేకాని మీడియాకు ఎక్కి రచ్చ చేస్తామంటే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ పరోక్షంగా ఆనం రాంనారాయణ రెడ్డిని హెచ్చరించారు.

 

గురువారం  ఉదయం అసెంబ్లీ లో నిబంధలను ప్రస్తావిస్తూ తెలుగుదేశం పార్టీ సభ్యులను ఆత్మరక్షణ లోకి నెట్టడం లో కీలకంగా వ్యవహరించిన వెంటనే ఆనం,  మంత్రి బాలినేని తో కలిసి వెళ్లి జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది . ఏ పరిస్థితుల్లో తాను మాఫియా అంటూ  వ్యాఖ్యలు చేశానో ఆనం రామనారాయణ రెడ్డి , ఈ సందర్బంగా జగన్ కు వివరించినట్లు తెలుస్తోంది . దీనితో ఈ  ఎపిసోడ్ కు శుభం కార్డు పడినట్లేనని వైస్సార్ కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: