సాధారణంగా అసెంబ్లీ సమావేశాలంటే ఆరోపణలు, ప్రత్యారోపణలు, నిందలు, విమర్శలు.. ఇదీ వరుస.. ఇలాంటి అసెంబ్లీలో ఓ అద్భుతమైన సాహితీ ప్రసంగం వినగలమా.. పుస్తకాల గురించి.. సాహిత్యం గురించి, భాష గొప్పదనం గురించి ఓ చక్కటి ప్రసంగాన్ని ఊహించగలమా.. కానీ అది వాస్తవమే అని నిరూపించారో వైసీపీ ఎమ్మెల్యే. ఆయనే భూమన కురణాకర్ రెడ్డి.

 

సాహిత్యాన్ని బాగా ఇష్టపడే భూమన కరుణాకర్ రెడ్డి ఆంగ్ల మాధ్యమం పై చర్చ సమయంలో ఆలోచింపజేసే ప్రసంగం చేశారు. భాషపట్ల ప్రేమ ఉన్నవాళ్లు కూడా మనుగడ కోసమని ఆంగ్లమాధ్యమం యొక్క అవసరాన్ని గుర్తించవలిసి వచ్చే పరిస్థితి గురించి వివరించారు.

తెలుగుభాష పట్ల నాలుగేళ్లు ఉత్సవాలు నిర్వహించిన అనుభవం ఆయనది.

 

ఇంగ్లీష్ ప్రాధాన్యాన్ని ఆయన వివరిస్తూ... " స్పార్టకస్, రూట్స్ లాంటి పుస్తకాలను ఆంగ్లం రాని కారణంగా నేను చదవలేకపోయాను. వాటిని ఇన్నేళ్లకు ఇప్పుడు తెలుగులోకి అనువదించాక చదువుకున్నా. ఇక్కడున్న 175 శాసన సభ్యుల్లో మనమందరం తాతలై మనవలు, మనవరాళ్లూ ఉన్నవాళ్లు ఉన్నారు. వీరిలో ఒక్కరి పిల్లలైనా, మనవలైనా తెలుగు మాధ్యమం పాఠశాలల్లో చదువుతున్నారా? అంటూ ప్రశ్నించారు.

 

తెలుగు సాహిత్యంలో అజరామరమైన సంగీత రచనలు చేసిన డా.సి.నా.రె తన ప్రాధమిక విద్య ఉర్దూలో చేసారు. మహాకవి దాశరధిరంగాచార్య గారు కూడా ఉర్దూ మాధ్యమంలో చదివినవారే..అంటూ భూమన గుర్తు చేశారు. అంతే కాదు.. తెనాలికి వలస వచ్చిన తమిళుడు నటరాజన్ శారద అనే కలం పేరుతో తెలుగులో అద్భుతమైన రచనలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. శాసన సభ్యులమైన మనకు, ఆధిపత్య భావజాలం ఉన్నవారికీ మాత్రమే ఆంగ్లమాధ్యమమా? అని నిలదీశారు.

 

పేదవాడికీ, చదువుకోవాలనే తపన ఉన్నవాడికి, ఇతరులతో సమానంగా ఆర్థికంగా బాగుపడి సామాజికంగా మెరుగ్గా జీవించాలనుకునేవాళ్లకు ఆంగ్లమాధ్యమంలో చదువుకునే అవకాశం లేదా? ప్రభుత్వ పాఠశాల్లో చదివేవాళ్లు బలహీనవర్గాల వారు. ఆర్థికంగా వెనుకబడిన వాళ్ల పిల్లలు. వారు అక్కడే నిలిచిపోవాలా? భవిష్యత్తులో వారికి మంచి జరగద్దా ? అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: