ఇటీవల కొద్దిరోజుల క్రితం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ అనే యువకుడి పరువు హత్య ఘటన మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో కలకలం రేపింది. తన కుమార్తె తక్కువ కులం వ్యక్తి అయిన ప్రణయ్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకోవడంతో ఆగ్రహించిన ఆమె తండ్రి మారుతీరావు, ఎప్పటినుండో మంచి అదును కోసం ఎదురు చూసి, ఒకరోజు హాస్పిటల్ కి వచ్చిన అమృత, ప్రణయ్ ల పైకి ఒక రౌడీ ని పంపించడం, ఆ తరువాత వాడు హాస్పిటల్ నుండి ఇంటికి బయల్దేరుతున్న ప్రణయ్ ని అత్యంత కిరాతకంగా కత్తితో చంపడం జరిగింది. ఒక గ్యాంగ్ కి సుపారీ ఇచ్చి మరీ అమృత తండ్రి మారుతీ రావు ఆ దారుణానినికి పాల్పడ్డాడు. కాగా ఆ ఘటన తరువాత పోలీసుల చేత చిక్కి జైలు శిక్ష అనుభవిస్తున్న మారుతీ రావు, 

 

ఒకప్పటితో పోలిస్తే తన ప్రవర్తనలో ప్రస్తుతం చాలా మార్పు తెచ్చుకున్నట్లు సమాచారం. ప్రణయ్ హత్యానంతరం తన తల్లితండ్రుల వద్ద కొంత కాలం ఉన్న అమృత, ఆ తరువాత ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమె అత్తయ్య దగ్గరే కొన్నాళ్లుగా ఉంటోంది. ఇటీవల ఆమెకు తెలంగాణ ప్రభుత్వం తరపున కొంత సాయం కూడా లభించినట్లు తెలుస్తోంది. ఇకపై మరింత ఉన్నత చదువులు చదువుకుని మంచి ఉద్యోగం సంపాదిస్తానని, అలానే తన బిడ్డను కూడా ఏ లోటు లేకుండా చూసుకోవాలనుకుంటున్నట్లు అమృత  చెప్పడం జరిగింది. ఇక తమ కొడుకు తమతో లేనప్పటికీ, మనవడితోనే జీవితాన్ని గడుపుతోందట ఆమె అత్త. ఇకపోతే ఇటీవల ఒకానొక సందర్భంలో ఒక మీడియా ఛానల్ తో మాట్లాడిన అమృత, తనకు ప్రణయ్ చనిపోయిన సమయంలో బ్రతుకే అయోమయం అయిందని, 

 

అసలు బ్రతకాలని అనిపించేది కాదని చెప్పింది. అయితే రాను రాను మెల్లగా ఆ ఘటనను మరిచిపోవడానికి సిద్ధం అయిన తాను, బిడ్డ పుట్టిన తరువాత, ఇకపై ప్రణయ్ ని తన కొడుకు రూపంలో ఉన్నట్టు ఊహించుకుని జీవిస్తున్నట్లు చెప్పుకొచ్చిందట. అంతేకాక తన దృష్టిలో ప్రణయ్ మరణించలేదని, ఎప్పుడూ తన మనసులో అతడు బ్రతికే ఉంటాడని, అందుకే తన మనసుకు తాను ఎప్పుడూ ప్రణయ్ ప్రక్కనే ఉన్నట్లుగా సమాధానం చెప్పుకుంటుంటానని ఎంతో ఆవేదనతో చెప్పిందట. తన వంటి పరిస్థితి ఈ ప్రపంచంలో మరొక అమ్మాయికి రాకూడదని, ఎందుకంటే ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోయినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం అని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: