ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి.. ఇరుపక్షా పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం వేడి వేడి గానే జరిగిందని చెప్పొచ్చు. ఒకానొక టైం లో సిఎం జగన్ మోహన్ రెడ్డి అసహనాన్ని ప్రదర్శించారు. అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియం పై వాడి వేడి చర్చ కొనసాగింది..

తెలుగుదేశం పార్టీ మేము ఇంగ్లీష్ మీడియం కి వ్యతిరేకం కాదని తెలిపింది.. అప్పటి చంద్రబాబు హయం లో మున్సిపల్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెడితే మీ సాక్షి పేపర్ లో నా మీద, నా పార్టీ మీద వచ్చిన వ్యతిరేక కథనాలను మర్చిపోయారా జగన్ గారు అని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు..

 

సిఎం అసహనం తో సాక్షి పేపర్ లో వచ్చిన సంగతి ప్రస్తావన గూర్చి అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయలేదని, మీరేమి చేసారో, నేనేమీ చేసానో చర్చిద్దాం అన్నారు. అసెంబ్లీలో ఈ పేపర్ గొడవ అనవసరం అని జగన్ వ్యాఖ్యానించారు. అయిన చంద్రబాబు మళ్ళీ సిఎం మీద విరుచుకుపడ్డారు.

2017 లో నేను ఇంగ్లీష్ మీడియం పెడితే అపుడు వ్యతిరేకించి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని ప్రశ్నించిన సమయం లో వారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారో గుర్తుచేసుకోమని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై జగన్ స్పందించి జగన్ మోహన్ రెడ్డి అను నేను ఏ రోజయినా ఇంగ్లీష్ మీడియం ని వ్యతిరేకించానని నిరూపించడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు...

చంద్రబాబు మాట్లాడుతూ సాక్షి పేపర్ మా పార్టీ మీద మా మీద తప్పుడు రాతలు రాసిందని, మాకు, జనాలకి క్షమాపణ చెప్పాలని కోరారు.. సాక్షి లో రాస్తే మాకేమి సంబంధం లేదు అన్నట్లు జగన్ మాట్లాడుతున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై సిఎం జగన్ లో అసహనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

ఈ మనిషి కి ఎమన్నా బుద్ది, జ్ఞానం ఉందా అని అన్నారు. కళ్ళు పెద్దవి చేస్తే భయపడేవాళ్లు ఎవరు లేరని తెలిపారు. సాక్షి అనేది ఒక మీడియా వ్యవస్థ.. ఎవరి న్యూస్ ఛానెల్ లో వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు రాస్తారు. అవన్నీ తీసుకుని వచ్చి ఇక్కడ మాట్లాడితే ఎలా కుదురుతుంది అని ప్రశ్నించారు.


ఈ మాటలకి చంద్రబాబు స్పందించి మీకు విశ్వసనీయత లేదా? అసలు" మీ పేపర్ ఒక చెత్త పేపర్ "అని మండిపడ్డారు. నాకు బుద్ది, జ్ఞానం లేదు అంటారా? మీకు ఉందా, మీ పేపర్ కి ఉందా? అని తిరిగి ప్రశ్నించారు. తప్పుడు డబ్బులతో మేము ఛానెల్స్, పేపర్స్ పెట్టలేదని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: