దేశవ్యాప్తంగా  సంచలనం  సృష్టించిన  శంషాబాద్  దిశ  హత్యాచారం కేసు లో  దోషులుగా  వున్న నలుగురు నిందితులను  గత శుక్రవారం  తెల్లవారుజూమున పోలీసులు  ఎన్ కౌంటర్  చేసి  హతమార్చిన  సంగతి తెలిసిందే. అయితే  మొదట నిందితుల  బంధువులు తమ వారికి ఎలాంటి శిక్ష వేసిన  పర్వాలేదని  అనగా  ఎన్ కౌంటర్ తర్వాత  మాత్రం మాట మార్చారు.  కోర్టు తీర్పు రాకముందే  ఎలా చంపుతారని  ధర్నాలు కూడా చేశారు. 
 
ఈనిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య  రేణుక అయితే  సంచలన ఆరోపణలు చేస్తూ రోజు వార్తల్లో నిలిచింది.  కోర్టు తీర్పు కూడా రాకముందే   నా భర్త ను అన్యాయంగా  కాల్చి చంపారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ? నా అన్న వాళ్ళు లేకుండా పోయారు, నన్ను కూడా చంపేయండి లేదంటే నేనే ఆత్మహత్య చేసుకోవాలా   అంటూ రేణుక ధర్నాకు దిగగా  ఆ మరోసటి రోజు  నాకు  తక్షణ సహాయం కింద  25లక్షలు   ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్  చేసింది.  ఇక ఇప్పుడు ఆమె  మరో డిమాండ్ తో మీడియా ముందుకు వచ్చింది.  నా భర్త ఈ నేరం చేసుండడు ఇంతకుముందు  ఇలా చేసిన వాళ్ళు  జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు కదా నా భర్త కు కూడా  అదే శిక్ష వేస్తారనుకున్నా కానీ  అన్యాయంగా అతన్ని  ఎన్ కౌంటర్ లో చంపేశారు.  నేను ఒంటరిదాన్నైపోయాను, బ్రతకడానికి  నాకు  ఏదైనా  జాబ్  ఇప్పించాలని రేణుక ప్రభుత్వాన్ని కోరింది.  ఇక  మావాడిని అన్యాయంగా ఎన్ కౌంటర్ పేరుతో చంపేశారని లోకం ఒత్తిడి వల్లే ఇదంతా జరిగిందని  చెన్నకేశవులు తల్లి  ఆరోపించింది.  ఈ ఘటన లో ఏ 1 నిందితుడు గా వున్న మహమ్మద్ ఆరిఫ్ తో కలిసి  ఉన్నందుకే  నా కొడుకును ఇందులో ఇరికించారని వాడు  ఈ నేరం చేసుండడని ఆమె మీడియా ముందు వాపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: