ఒక ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశం జరుగుతున్నప్పుడు.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైద్యురాలు దిశ హత్యాచార ఘటన గురించి మాట్లాడారు. అయితే జగన్ ఏమన్నారంటే.. 'ఒక 26 ఏళ్ల వయసు చిన్నారి డాక్టర్. పాపం టోల్ గేట్ దగ్గర.. టోల్ కట్టడం కోసమని బైక్ దిగితే. నలుగురు వ్యక్తులు బైక్ టైర్ పంక్చర్ చేసి.. ఆమెను అక్కడే ఉండేటట్లు చేసి ఆ పంక్చర్ రిపేర్ చేస్తాము అని చెప్పి పక్కకు తీసుకెళ్లి రేప్ చేసి కాల్చేసిన ఘటన మన కళ్లముందే కనిపిస్తుంది.' అని అన్నారు.


ఆ తరువాత ఇంకా మాట్లాడుతూ.. 'నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలే. నాకూ ఒక చెల్లెలు ఉంది. నాకూ భార్య ఉంది. ఒకటే భార్య అధ్యక్షా నాకు ఉండేది' అని అన్నారు. దాంతో అసెంబ్లీ లోని సభ్యులంతా పకపకా నవ్వారు.



ఇక ఈ జగన్ దిశ సంఘటన గురించి మాట్లాడిన తీరును ఇటీవల కాలంలో టీడీపీలో చేరిన రాజకీయ విశ్లేషకురాలు ప్రొఫెసర్ జ్యోత్స్న తప్పు పట్టారు.


ఆమె ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ...'టోల్ గేట్ దగ్గర బైక్ లకు కూడా టోల్ చార్జీలు ఉంటాయనే సంగతి మాకైతే ఇప్పటివరకు తెలియదు. ఆయన కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నడెమో? అది అయితే ఒక విలువైన ప్రశ్న. ఒకవేళ ఆ వుద్దేశ్యం తోనేనైనా ఆయన ఆ మాటలు మాట్లాడితే.. ఇక్కడ కామన్ సెన్స్ లేదని అర్థమవుతుంది. టోల్ గేట్ల దగ్గర బైకులకు టోల్ తీసుకోరు... అటువంటి ఒక మినిమమ్ కామన్ సెన్స్ కూడా లేకుండా జగన్ మాట్లాడారు. ఆయనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి?' అని విమర్శించారు.



ఆ తర్వాత ఇంకా మాట్లాడుతూ... 'దిశ సంఘటనను అతి చిన్న విషయంగా చేస్తూ మాట్లాడుతున్నారు జగన్. ఆ అమ్మాయికి జరిగిన దారుణానికి... మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ఎలా స్పందించాలనేది పక్కన పెడితే. అసలు ఒక మనిషిగా.. ఒక సగటు మనిషి గా కూడా మీరు సరిగా స్పందించకుండా... దిశ ఘటనను చాలా చిన్న విషయం చేస్తూ... అంత సున్నితమైన మ్యాటర్ ని... హాస్యాస్పదం చేస్తూ మాట్లాడతారా? అలా చేయడానికి మీకు ఎంత ధైర్యం? ఇలాగ నువ్వు మాట్లాడుతున్నావు?.. నువ్వేనా మహిళల యొక్క సంరక్షణ గురించి ఆంధ్రప్రదేశ్ లో చట్టాల్ని తెచ్చేది?


'ఎంత నాటకముగా మీరు మాట్లాడుతున్నారనేది నాకు నిన్ననే అర్థమైపోయింది. దిశ సంఘటన గురించి మీకు ఏమీ తెలియదనేది స్పష్టంగా అర్థమైపోయింది. మీరు ఎప్పుడైతే బైక్ లకు టోల్ కట్టడం అని మాట్లాడారో.. అప్పుడే నీకు దిశ సంఘటన గురించి అవగాహనా లేదని స్పష్టమైంది. ఏదో అసెంబ్లీలో దిశ గురించి మాట్లాడక తప్పదని నువ్వు మాట్లాడావ్.. సరే మీరు మాట్లాడుతున్నారు కదా అనే వినేంతలోపే... మీరు ఏ మాత్రం కామన్ సెన్స్ లేకుండా.. కొంచెం కూడా సున్నితత్వం లేకుండా... చాలా సెన్సిటివ్ మేటర్ అయిన దిశ గురించి హాస్యాస్పదంగా చేసేశారు.'


'పక్కన వాళ్లు నవ్వేట్లుగా చేస్తారా మీరు? ఒక ముఖ్యమంత్రి స్థాయి లో ఉన్నటువంటి వ్యక్తి చేయాల్సిన పనులా ఇవి..? మీరు మహిళలకు రక్షణ, భద్రత ఇస్తారంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఒక్కసారి మీరు ఏం మాట్లాడారో చూడండి. ఆ తర్వాత మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి... మీరు మహిళల అభివృద్ధి కొరకు మీకు చిత్తశుద్ధి ఉందని నమ్మమంటే మేము ఎలా నమ్ముతాం?' అంటూ జగన్ మోహన్ రెడ్డి ని ప్రొఫెసర్ జ్యోత్స్న విమర్శించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: