దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార, హత్య కేసులో కీలక తీర్పు ప్రకటించిన సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ తో విచారణ జరిపించాలిసిందిగా ఆదేశం ఇచ్చారు. ఇదిలా ఉండగా ఎన్ కౌంటర్ లో చనిపోయిన నలుగురు నిందితులు మృతదేహాలను హైకోర్టు ఆదేశాల అనుసారం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో భద్రపరిచిన విషయం మనందరికీ తెలిసినదే. ఇప్పుడు ఈ కేసు సుప్రీం కోర్టు విచారణ చేపడుతునందున్న హైకోర్టు వారి బంధువులకు ఆ మృత దేహాలను అప్పగించే విషయం సుప్రీం కోర్టు నుంచి స్పష్టత తీసుకోవాలని వారికి ఆదేశించింది.

 

 ఈ ఎన్ కౌంటర్ కి సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు నిలిపివేసింది అని తెలిపారు. ఎన్కౌంటర్ పై మహిళా సంఘాలు రాసిన లేఖతో పాటు అనంతరం దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ,జస్టిస్ అభిషేక్ రెడ్డి లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే శుక్రవారం బంధువులకు మృతదేహాలను అప్పగిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

 

ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ విచారణపై సుప్రీంకోర్టులో స్టే విధించినందున మృతదేహాల విషయం కూడా సుప్రీంకోర్టు తేల్చాలని చెప్పారు. సుప్రీం కోర్టు కేసు విచారణ నిర్వధికంగా వాయిదా వేశారు. ఈ రోజు మృతదేహాల గురించి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు నుంచి వివరణ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి అంచనా ప్రకారం ఒక స్వతంత్ర బృందంతో రీ పోస్టుమార్టం నిర్వహించి అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

ఇప్పటివరకు మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం ఎన్‌కౌంటర్‌ వ్యవహారం ఏదైనా కోర్టు ముందు గానీ, అధికారి ముందు గానీ జరిగి ఉంటే ఆ విచారణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిందని, ఇది కోర్టే కదా అని ప్రశ్నించింది. ఏజీ జోక్యం చేసుకుంటూ ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన ముకుల్‌రోహత్గితో తాము మాట్లాడామని, మృతదేహాల విషయం సుప్రీంకోర్టులో ప్రస్తావించారని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ... అయి ఉండవచ్చని, ఉత్తర్వుల జారీ సమయంలో ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఉండకపోవచ్చంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: