చాలా దేశాల్లో వయాగ్రా కొనాలంటే  వైద్యుల ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. కాని మనదేశంలో అలా కాదు చాలా చోట్ల మందుల షాపుల్లో మందుల చీటీ లేకుండానే వయాగ్రా ఇచ్చేస్తుంటారు. ఇకపోతే ఇది అందరు వాడకూడదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండెజబ్బులు ఉన్నవారు ఈ వయగ్రా జోలికి వెళ్ళక పోవడమే మంచిదంటున్నారు.

 

 

ఇకపోతే ఈ వయాగ్రాను ఎందుకు వాడుతారంటే ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనేందుకు పురుషులు వాడే ఔషదం ఇది. అయితే దీని వల్ల ఒక చిక్కు వచ్చిందట. అదేమంటే ఇటీవల సుమారు 750 టన్నుల శుద్ధి చేయని వయాగ్రాను ఐర్లాండ్‌లోని ఫిజర్ అనే ఫార్మా కంపెనీ నదిలో కలిపేసిందట. ఆ నీటిని తాగిన సుమారు 80 వేల గొర్రెలు తాపంతో తహతహలాడాయట. వాటిని అదుపు చేయడం గొర్రెల కాపర్లకు కూడా సాధ్యం కాలేదట.

 

 

ఇక కొన్ని గొర్రెలైతే నిర్విరామంగా అదే పనిలో ఉన్నాయట. ఈ సమాచారం ‘ఇండో-ఏసియా న్యూస్ సర్వీస్’ అనే వార్తా ఏజెన్సీ ద్వారా వ్యాపించింది. అది వైరల్ కావడంతో అంతర్జాతీయ మీడియాతోపాటు ఇండియాలోని పలు ప్రముఖ న్యూస్ వెబ్‌సైట్లు సైతం ఈ వార్తను ప్రచురించాయి. అయితే చివరికి, గొర్రెలు.. వయాగ్రా కలిసిన నదిలో నీళ్లు తాగడం వాస్తవం కాదని, అది ఓ వ్యంగ్య వార్త మాత్రమేనని తేలింది.

 

 

వాస్తవానికి ఈ కథనాన్ని  ‘వరల్డ్ న్యూస్ డైలీ రిపోర్ట్-WDNR’ అనే వార్తా సంస్థ రాసిందట. కానీ చివరికి ఈ వార్త కల్పితమని స్పష్టం చేసింది. అయితే, ఏజెన్సీ ద్వారా ఈ వార్త వ్యాపించడం వల్ల ప్రముఖ వార్తా సంస్థలు ఈ విషయాన్ని గుర్తించి ఉండక పోవచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత ఇది ఫేక్ వార్త అని తెలిసిన వెంటనే దాన్ని ఆయా వెబ్‌సైట్ల నుంచి డిలీట్ చేశారట కూడా. ఇకపోతే ఈ వార్త ప్రస్తుతం తెలుగు వెబ్‌సైట్లలో కూడా వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోందట. ఏంటో కలికాలం ఏది నిజమో ఏది అబద్దమో తెలియకుంది అని అనుకుంటున్నారట ఈ విషయం తెలిసిన వారు..

మరింత సమాచారం తెలుసుకోండి: