అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబునాయుడు అడ్డంగా దొరికిపోతున్నారు. వైసిపి ప్రభుత్వ పాలనపై ఆరోపణలతో విరుచుకుపడుతున్న చంద్రబాబు తన హయాంలో తానేం చేశారనే విషయాన్ని మరచిపోతున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశల సందర్భంగా ఈ విషయం చాలా స్పష్టంగా తెలిసిపోతోంది. అవకాశం దొరగ్గానే వైసిపి సభ్యులు చంద్రబాబుపై రివర్స్ పంచ్ లతో దుమ్ము దులిపేస్తున్నారు. దాంతో చంద్రబాబు ప్రతిసారి తలొంచుకోవాల్సొస్తోంది.

 

ఇంతకీ నాలుగు రోజుల సమావేశాల్లో ఏం జరిగిందో చూద్దాం. స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టే అంశాన్ని చూస్తే గతంలో తన హయాంలో కూడా ఇంగ్లీషుమీడియం ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. అయితే వివిధ కారణాలతో పూర్తిగా అమలు చేసే ధైర్యం లేక వెనక్కు తగ్గారు. ఇపుడు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలన్న జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. దాంతో వైసిపి సభ్యులు చంద్రబాబుపై రివర్స్ ఎటాక్ మొదలుపెట్టారు.

 

మీడియా స్వేచ్చ అంటూ 2430 జీవోపై చంద్రబాబు మండిపోతున్నారు. నిజానికి చంద్రబాబు హయాంలో కూడా చాలామంది రిపోర్టర్లపై కేసులు పెట్టిన విషయాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి ఉదాహరణలతో సహా చదివి వినిపించారు. మీడియాపై కేసులు పెట్టే అధికారాన్ని సమాచార, పౌర సంబంధాల శాఖ కమీషనర్ కు కట్టబెట్టిన జీవోను బుగ్గన చదవి వినిపించటంతో చంద్రబాబు తలొంచుకున్నారు.

 

ఇక అసెంబ్లీలోకి వచ్చేటపుడు తమ దగ్గరున్న బ్యానర్లు, ప్ల కార్డులను మార్షల్స్ లాక్కుని తమపై ధౌర్జన్యం చేశారంటూ అచ్చెన్నాయుడు తీవ్రంగా ఆరోపణలు చేశారు. చంద్రబాబుపై మార్షల్స్ అనుచితంగా ప్రవర్తించారంటూ ఫిర్యాదు చేశారు. టిడిపి ఫిర్యాదుతో స్పీకర్ వీడియో ఫుటేజీలను తెప్పించి అసెంబ్లీలోనే ప్రదర్శించారు. అందులో ఏ మార్షల్ కూడా చంద్రబాబును అడ్డగించలేదు.

 

పైగా టిడిఎల్పిలోని తన కార్యాలయంలోకి వెళుతున్న సమయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ జగన్ ను ఉన్మాది అంటూ వ్యాఖ్యానించటం స్పష్టంగా కనబడింది. అదే సమయంలో బ్యానర్లు, ప్ల కార్డులను అడ్డగించే విషయంలో గతంలో చంద్రబాబు సిఎంగా ఉన్నపుడు విడుదల చేసిన జీవోలను ఉదాహరిస్తు ఆ ఉత్తర్వులనే తాము ఫాలో అవుతున్నట్లు బుగ్గన చదివి వినిపించటంతో చంద్రబాబు నోరు పడిపోయింది. ప్రతి విషయంలోను వైసిపికి దొరికిపోతున్న చంద్రబాబు ప్రతిసారి తలొంచుకోవాల్సొస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: