జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రైతుల సమస్యలపై నిన్న (డిసెంబర్ 12) కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష చేశారు. నగరంలోని జేఎన్టీయూ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని పవన్ తన దీక్షకు ఉపయోగించుకున్నారు. ఈ సందర్బంగా ఒక జనసేన పార్టీ మహిళా కార్యకర్త సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

రైతు సౌభాగ్య దీక్ష సందర్బంగా ఈ మహిళా కార్యకర్త మాట్లాడుతూ "సభలో లేని మా నాయకుడు పవన్ కళ్యాణ్ పై మాట్లాడడం ఎంతవరకు న్యాయం. పవన్ కళ్యాణ్ ను ఏదైనా అనే ముందు ఒక్కటికి రెండు సార్లు ఆలోచించుకోండి. అక్కా రోజా అక్క పెళ్లి చేసుకుంటే ఒక్కరే భార్య అదే పెళ్లి చేసుకోకుండా ఎంత మంది భార్యలు ఉన్నా పర్లేదా" అంటూ వైసీపీ నేత, నగరి ఎమ్యెల్యే రోజా కు వార్నింగ్ ఇచ్చారు ఈ కార్యకర్త. 

 

అంతటితో ఆగకుండా వైసీపీ పార్టీ కి చెందిన ఎంపీ విజయసాయి రెడ్డికి కూడా వార్నింగ్ ఇచ్చారు ఈ మహిళా కార్యకర్త "సూటుకేసుల బాబాయ్ జాగ్రత్త, మా నాయకుడి మీద ట్వీట్లు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారి వెనుక మేము ఉన్నాం" అంటూ పేర్కొన్నారు. ఈ మహిళా కార్యకర్త వ్యాఖ్యలపై వైసీపీ నేత రోజా ఎలా స్పందిస్తారో చూడాలి.

 

ఇక రైతు సౌభాగ్య దీక్షకు నాదెండ్ల మనోహర్ తో పాటు జనసేన ప్రధాన నాయకులు అందరూ హాజరు అవ్వగా జనసేన పార్టీ నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్యెల్యే రాపాక వర ప్రసాద్ ఈ దీక్షకు డుమ్మా కొట్టారు, దీక్షకు డుమ్మా కొట్టడం ద్వారా పార్టీకి తాను దూరంగా వుంటాను అని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. జనసేనకు చెందిన ఒకే ఒక్క ఎమ్యెల్యే కూడా పార్టీ కి దూరంగా ఉండడంతో ప్రస్తుతం పార్టీ పరిస్థితి అంతగా బాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: