దిశపై అత్యాచారం, హత్య చేసి ఆపై ఆమెను అత్యంత దారుణంగా కాల్చి బూడిద చేసిన నలుగురు నిందితులను డిసెంబర్ 6 వ తేదీ తెల్లవారుతుండగానే పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.  ఈ ఎన్ కౌంటర్ లో నిందితులు చనిపోయారు.  నలుగురు నిందితులను అదే రోజున ఖననం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పోలీసులు చేశారు.  ఆరోజే ఖననం చేస్తే... పని పూర్తయిపోతుంది.  అక్కడి నుంచి ఈ కేసును క్లోజ్ చెయ్యొచ్చు అనుకున్నారు.  


కానీ, హైకోర్టు అడ్డు చెప్పడంతో వాళ్ళ ఖననం ఆగిపోయింది.  నలుగురు నిందితుల డెడ్ బోడీలు మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో కొన్ని రోజులు ఉంచారు.  హైకోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు వాళ్ళ డెడ్ బాడీలను ఫ్రీజింగ్ లో ఉంచాలని మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీ నుంచి గాంధీ మార్చురీకి తరలించారు.   ఇప్పటికే వారం రోజులైంది వాళ్ళు మరణించి.  ఇప్పటి వరకు వారి డెడ్ బాడీలకు మోక్షం రాలేదు.  


తప్పు చేశారు... చంపేశారు.. కానీ, వారి మృతదేహాలను ఇంకా ఖననం చేయకపోడంతో వారి ఆత్మలు అక్కడక్కడే తిరుగుతుంటాయి.  ప్లీజ్ ఖననం చేయండి అని మొరపెట్టుకుంటూ ఉంటాయి.  ఎందుకంటే, భూమిలో కలిపేస్తే ఆ తరువాత జరగాల్సిన కర్మలు ఉంటాయి.  అవి పూర్తి చేస్తే ఆ ఆత్మలు ఇక్కడి నుంచి పైలోకాలకు వెళ్లిపోవచ్చు.  లేదంటే ఇక్కడిక్కడే అలానే తిరుగుతుంటాయి.  


నవంబర్ 27 వ తేదీ రాత్రి 9:30 గంటల ప్రాంతంలో దిశ బైక్  టైరు పంచర్ చేసి ఆపై ఆమెను ట్రాప్ చేసి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారు.  అక్కడితో ఆగకుండా దిశను కాల్చి బూడిద చేశారు.  దీంతో యావత్ భారతదేశం ఈ విషయంపై భగ్గుమన్నది.  ఈ మారణకాండను చూసి క్షోభించింది.  నిందితులను బహిరంగంగా ఉరితీయాలని లేదంటే ఎన్ కౌంటర్ చేయాలని ముక్తకంఠంతో నిరసనలు చేయడంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది.  ఆ తరువాత ఏం జరిగిందో తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: