జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏమో అయినట్లే ఉంది. లేకపోతే లక్షమంది రైతులను తయారు చేయాస్తనని  ప్రకటించటమేంటి  ?  రైతులను తయారు చేయటమంటే వాళ్ళేమన్నా వస్తువులా ఉత్పత్తి చేయటానికి. అసలే వ్యవసాయం గిట్టుబాటు రంగం కాకపోవటంతో రైతు కుటుంబాల్లోని వారసులే వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. ఇటువంటి సమయంలో పవన్ చేసిన ప్రకటన విచిత్రంగా ఉంది.

 

గడచిన ఆరు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటు లక్షలమంది జనసైనికులను తయారు చేశారు. ఇక రైతులను తయారు చేస్తారట.  నోటికేదొస్తే అది మాట్లాడేయటమే కానీ సాధ్యాసాధ్యాల గురించి కనీసమాత్రంగా కూడా ఆలోచించటం లేదు. పైగా రైతులకు గిట్టుబాటు ధరలు అవసరం లేదనే కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. గిట్టుబాటు ధరలు అవసరం లేదట లాభసాటి ధర కావాలంటూ కొత్త డిమాండ్ ను మొదలుపెట్టారు.

 

పవన్ చెప్పేదెలాగుందంటే జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రైతాంగానికి ఎటువంటి సాయం చేయటం లేదట. వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలు అందించటానికి జగన్ చేస్తున్న కృషి కనబడలేదు. అలాగే ధరల స్ధిరీకరణ నిధి పేరుతో రూ. 3 వేల కోట్ల కేటాయింపూ కనబడలేదు.  కేంద్రం ఇచ్చేది కలుపుకుని రైతుల ఖాతాల్లో ఏడాదికి రూ. 12500 వేయిస్తున్నారు.

 

నిజానికి రైతాంగానికి మద్దతుగా ఆరుమాసాల్లో జగన్ తీసుకున్న చర్యలేవీ  ఐదేళ్ళలో చంద్రబాబునాయుడు ఒక్కటి కూడా తీసుకోలేదు. అయినా చంద్రబాబును ప్రశ్నించటానికి పవన్ కు ఒక్కసారి కూడా నోరు లేవలేదు. అలాంటిది జగన్ సిఎం అయిన దగ్గర నుండి పవన్ ఆరోపణలు, విమర్శలతో హోరెత్తించేస్తున్నారు. 

 

చంద్రబాబు ఐదేళ్ళ పాలనను జగన్ ఆరుమాసాల పాలనతో ఎలా పోలుస్తారో అర్ధం కావటం లేదు. పైగా తాను చిన్నపుడు వ్యవసాయం చేశానని చెప్పటమే విచిత్రంగా ఉంది. వ్యవసాయమంటే ఏంటో తనకు బాగా తెలుసనే కొత్త విషయాన్ని చెప్పారు. మొత్తానికి సందర్భం ఏదైనా, ఏ సమయమైనా జగన్ ను వ్యతిరేకించటమే టార్గెట్ గా పెట్టుకుంటున్నట్లు తెలిసిపోతోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: