దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన తరువాత వారి డెడ్ బాడీలను ఖననం చేయకుండా ఇంకా వాటిని గాంధీ మార్చురీలోనే భద్రపరిచారు.  ఇప్పటికే వారం రోజులైంది.  డీ కంపోజింగ్ కాకుండా ఉండేందుకు ఆ బాడీలను ప్రత్యేక రసాయనాల్లో ఉంచి జాగ్రత్త చేస్తున్నారు.  అయితే, ఇలా ఫ్రీజింగ్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది.  ఇదంతా ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది.  


ఇక ఇదిలా ఉంటె, నిందితుల డెడ్ బాడీల ఖననం విషయంపై హైకోర్టు కూడా చేతులు ఎత్తేసింది.  తమకు ఎలాంటి సంబంధం లేదని, సుప్రీం కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పింది. ఇప్పుడు సుప్రీం కోర్టు ఈ విషయంలో మాజీ జస్టిస్ సిర్పూర్కర్ నేతృత్వంలో త్రిసభ్య కామెడీని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది.  ఈ ఎన్ కౌంటర్ విషయంలో ఏం జరిగింది.  ఎలా జరిగింది.  ఎందుకు చేశారు అనే విషయాలపై త్రిసభ్య కామెడీ విచారణ జరపబోతున్నది.  


ఆరు నెలల్లోనే ఈ విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని, సమగ్రంగా విచారణ చేయాలని కోర్టు సూచించింది.  ఇక త్రిసభ్య కామెడీకి కావాల్సిన అన్ని ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వం చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  కోర్టు ఆదేశాల మేరకు త్రిసభ్య కామెడీ విచారణ చేపట్టబోతున్నది.  అటు హైకోర్ట్, ఎన్ హెచ్ఆర్ సి లపై స్టే విధించింది.  ఇదంతగా బాగానే ఉన్నది.  


గాంధీ మార్చురీలో ఉన్న డెడ్ బాడీల పరిస్థితి ఏంటి అన్నది తెలియాల్సి ఉన్నది.  డెడ్ బాడీల ఖననం చేసే అవకాశం ఉందా లేదా అన్నది కూడా తెలియాలి.  ఇప్పటి వరకు డెడ్ బాడీలను ఖననం చేయలేదు.  ఎన్ కౌంటర్ జరిగిన రోజునే ఖననం చేయాలి అనుకున్నా.. హైకోర్టు అడ్డుకోవడంతో ఆగిపోయిన ఖననం, ఇప్పటి వరకు పెండింగ్ లోనే ఉన్నది. మరి ఏం జరుగుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: