దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంట‌ర్ తెలంగాణ పోలీసులను కోర్టుల చుట్టూ తిరిగేలా చేసేట్లు ఉంది. ఇప్పటికే పలు కోర్టుల్లో ఎన్‌కౌంట‌ర్ కు వ్యతిరేకంగా పిటిషన్లు నమోదు అవ్వగా, ఎన్‌కౌంట‌ర్ పై వ్యతిరేకంగా కొందరు సుప్రీం కోర్టు మెట్లను కూడా ఎక్కారు. విచారణ చేపట్టిన కోర్టు దిశ నిందితుల ఎన్‌కౌంట‌ర్ పై త్రి సభ్య కమిటీని నియమిస్తున్నట్లు పేర్కొంది. ఆరు నెలల లోపు విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. 

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇదే మొట్టమొదటి జ్యూడిషియల్ విచారణ కావడంతో పోలీసుల్లో అలజడి మొదలైంది. ప్రజలు సైతం త్రి సభ్య కమిటీ ఏం చెప్తుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు న్యాయవాది గోపాల కృష్ణ కళానిధి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో దిశ హత్యాచారం నిందితుల ఎన్‌కౌంట‌ర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు "ఈ కేసు సుప్రీంలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ త్రి సభ్య కమిటీ సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్‌కౌంట‌ర్ బూటకమని తేలితే ఆ సంఘ‌ట‌న‌లో పాల్గొన్న పోలీసులంద‌రికీ ఐపీసీ 302 సెక్ష‌న్ ప్ర‌కారం మ‌ర‌ణ శిక్ష ప‌డుతుంది" అని చెప్పారు. 

 

దిశ హత్య కేసు నిందితులపై మోపబడిన నేరం రుజువు కానుందున వారు అప్పటికి నిందితులు మాత్రమే దోషులు కారు అని చెప్పారు. ఇక కోర్టు పోలీసులకు నిందితులను కస్టడీకి అప్పగించిన కారణంగా, పోలీసులు తిరిగి నిందితులను కోర్టుకు అప్పజెప్పాల్సి ఉంటుందని, కస్టడీలో ఉన్న నిందితులను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన భాద్యత పోలీసులదే అంటూ న్యాయవాది పేర్కొన్నారు. పోలీసులు నిందితులను క్రైమ్ సీన్ రీ కంస్ట్రక్షన్ కోసం తెల్లవారుజామున 5 గంటలకు ఘటనా స్థలానికి తీసుకెళ్లామని చెప్పిన నేపథ్యంలో, సీపీ సజ్జనార్ నిందితులను ఎన్ని గంటలకు కోర్టు నుంచి కస్టడీకి తీసుకున్నారో సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా వెల్లడిస్తే బాగుండేది అని అభిప్రాయపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: