తాజాగా దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీం కోర్టు జ్యుడీషియల్ విచారణకు ఆదేశించడంతో పోలీసు శాఖలో అలజడి మొదలైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత న్యాయ విచారణ జరుగుతున్న మొదటి కేసు ఇది అవ్వడం గమనార్థకం. త్రిసభ్య విచారణ కమిటి ఈ కేసును విచారణ చేపట్టనున్నది. ఆరు నెలల్లోపే దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని న్యాయ విచారణ కమిటిని సుప్రీం కోర్ట్ ఆదేశించడం జరిగింది. ఈ కమిటికి సివిల్ కోర్టు అధికారాలు కూడా ఉండడం జరుగుతుంది. సుప్రీం నుంచి ఉత్తర్వులు అందగానే రాష్ట్ర ప్రభుత్వం వారికి కార్యాలయం, వసతి, సౌకర్యాలను కల్పించబోతుంది. 

 

ఈ కమిటి దిశ అత్యాచారం, హత్య స్థలం, ఎన్ కౌంటర్ స్థలాన్ని పరిశీలినచబోతుంది. దిశ కుటుంబ సభ్యులను, నిందితుల కుటుంబ సభ్యులను, సాక్ష్యులను విచారించడం జరుగుతుంది. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలను పరిశీలించనుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని అందరిని విచారణ చేస్తాము అని అధికారులు తెలియాచేస్తున్నారు. పోలీసులను కూడా కమిటి విచారించనుంది. వాస్తవ వాస్తవాలను నివేదిక రూపంలో తయారుచేసి కమిటి సుప్రీం కోర్టుకు అందజేస్తుంది. నివేదిక ఆధారంగా సుప్రీం కోర్టు తీర్పును వెలువరించనుంది. 

 

తెలంగాణలో వామపక్ష తీవ్రవాదం ఉండడంతో ఎన్ కౌంటర్లు జరుగుతూ ఉండేవి. గతంలో 2007లో ముదిగొండలో జరిగిన కాల్పులపై రిటైర్డ్ జడ్జి పాండురంగారావు నేతృత్వంలో న్యాయ విచారణ జరిగింది. 2015లో ఉగ్రవాదిగా ముద్రపడ్డ వికారుద్దీన్, అతని అనుచరులు ఆలేరు వద్ద ఎన్ కౌంటర్ లో చనిపోవడం కూడా జరిగింది. దీని పై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ వచ్చినా సర్కార్ మాత్రం సిట్ తో సరి పెట్టడం జరిగింది. తెలంగాణ ఏర్పడ్డాక జరుగుతున్న మొదటి న్యాయ విచారణ కేసు కావడంతో పోలీసు శాఖలో బాగా అలజడి మొదలైంది. ఇంకా ఎన్ని నిజాలు బయటికి వస్తాయో వేచి ఉండి చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: