పౌరసత్వ సవరణ బిల్లుకు (క్యాబ్‌) ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. పార్లమెంట్‌లో సిటిజన్‌షిప్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మేఘాలయలో కూడా సిటిజన్‌షిప్ బిల్లుకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్ల మీదికి వచ్చి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. శాన్యరాష్ర్టాల్లో కొనసాగుతున్న నిరసన గురువారం మహోగ్రరూపాన్ని సంతరించుకున్నది. అసోం ప్రజల సంస్కృతికి ఎలాంటి ప్రమాదం ఉండదని ప్రధాని మోదీ హామీ ఇచ్చినా ప్రజలు వెనక్కి తగ్గ లేదు. అసోం అట్టుడుకుతున్నది. గువాహటితోపాటు జిల్లాల్లో పోలీసు కాల్పులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తుల విధ్వంసంతో రాష్ట్రం రణరంగంగా మారింది. ఈ నేపథ్యంలో గువాహటితోపాటు డిబ్రూగఢ్‌, టిన్సుకియా, జోరాట్‌ జిల్లాల్లో భారీగా సైన్యాన్ని మోహరించారు.

 

65 ఏళ్ల‌ ముస‌లోడికి పోరీల పిచ్చి..73 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి ఏం చేశాడో తెలుసా?


రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం పొందడంతో గౌహతి, దిబ్రూఘర్‌లలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఇదే స‌మ‌యంలో ఎటువంటి గొడవలు జరగకూడదనే ఉద్దేశంతో అక్కడి అధికారులు మేఘాలయలో 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఎస్ఎంఎస్, వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, మరియు యూట్యూబ్ ద్వారా తప్పుడు ప్రచారం జరిగి ప్రజల భద్రతకు ముప్పు రాకుండా ఉండటానికి మేఘాలయలో గురువారం సాయంత్రం 5 గంటల నుండి మొబైల్ ఇంటర్నెట్ మరియు మెసేజింగ్‌ను 48 గంటలపాటు నిలిపివేస్తున్నట్లు మేఘాలయ హోం పోలీస్ శాఖ అదనపు కార్యదర్శి సివిడి డియాంగ్‌డో గురువారం తెలిపారు. అలాగే, తూర్పు ఖాసీ హిల్స్‌లో గురువారం రాత్రి 10 గంటల నుండి కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ కర్ఫ్యూ అమలులో ఉంటుందని వారు తెలిపారు. ఇదిలా ఉండగా.. పొరుగు రాష్ట్రమైన అస్సాంలో మొబైల్ ఇంటర్నెట్ బందును మరో 48 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. 

 

సొంత ఇళ్లు కూల్చి..షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం...బాల‌కృష్ణ సంచ‌ల‌న నిర్ణ‌యానికి కార‌ణం ఆయ‌నేనా? 

 

గువాహటి, డిబ్రూగఢ్‌లో బుధవారం నుంచే కర్ఫ్యూ విధించగా.. దీనిని ధిక్కరిస్తూ ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఆసు) గురువారం భారీ బహిరంగ సభ నిర్వహించింది. దీనికి కళాకారుల సంఘం ‘శిల్పి సమాజ్‌' సహకారం అందించింది. మరోవైపు గువాహటిలో వేలాది మంది ఆందోళనకారులు రోడ్ల మీదికి వచ్చారు. టైర్లు కాల్చుతూ, ప్రజా, పోలీసు వాహనాలను ధ్వంసం చేస్తూ, పోలీసులపైకి రాళ్లు రువ్వుతూ వీరంగం సృష్టించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు రాళ్లు, ఇటుకలు రువ్వడంతో భద్రతా సిబ్బంది లాఠీచార్జీ, కాల్పులు జరిపారు. పోలీసు కాల్పుల్లో గాయపడినవారిని గువాహటిలోని మెడికల్‌ కాలేజీకి తరలించారు. వారిలో ఇద్దరు మరణించారని అధికారులు తెలుపగా, ముగ్గురు మరణించారని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: