హైదరాబాద్ షాద్నగర్లో వైద్యురాలు దిశా ను  అతి దారుణంగా నలుగురు నిందితులు పథకం ప్రకారం అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే.  దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపింది. దేశం మొత్తం ఈ ఘటనలో నిందితులను ఉరి  వేసి వెంటనే చంపాలంటు  డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేసారు.  ఈ నేపథ్యంలో పోలీసులు నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేశారు. అయితే దిశ కేసులోని నలుగురు నిందితుల ఎన్కౌంటర్ తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలా వద్దా అనే దానిపై హై కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇదిలా ఉండగా అటు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా దిశ కేసలోని నిందితుల  ఎన్కౌంటర్ ఫేక్ అంటూ ఆరోపణలు రావడంతో  విచారణ జరిపుతుంది.  అటు తెలంగాణ ప్రభుత్వం కూడా దిశా నిందితుల ఎన్కౌంటర్ పై  విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. 

 

 

 

 కాగా దిశా  నిందితుల ఎన్కౌంటర్ పై  సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. అయితే దీనిపై విచారించిన సుప్రీంకోర్టు... దిశా  కేసులో నలుగురు నిందితులను ఎన్కౌంటర్ విషయంలో ఎవరూ విచారణ చేపట్టవద్దని... సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిషన్ కు మాత్రమే దిశా  కేసులో విచారణ చేపట్టేందుకు అధికారం ఉంటుందంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో నిందితులను కుటుంబ సభ్యులకు అప్పగించాలా  అలా వద్దు అంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరుగుతున్నప్పటికీ... సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంతో హైకోర్టు ఏం తేల్చలేకపోయింది. దీంతో మృతదేహాల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. ప్రస్తుతం దిశా  కేసులో ఎన్కౌంటర్ కు గురైన నలుగురు నిందితుల మృతదేహాలు గాంధీ ఆస్పత్రిలో భద్రపరచబడి ఉన్నాయి.

 

 

 

 అయితే సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ నలుగురు నిందితులు మృతదేహాలను ఆస్పత్రిలోనే భద్రపరచాలి అంటూ ఆదేశించింది. కాగా  అటు దిశ నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిషన్ తో  పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అటు నిందితుల కుటుంబ సభ్యులు తమకు  కడు చూపుకి కనీసం మృతదేహాలను  అప్పగించండి అంటూ అధికారులను వేడుకుంటున్నారు. పోలీసులు అరెస్టు చేసినప్పటి నుంచి కనీసం ఒక్కసారి కూడా తమ వారిని చూసుకునే భాగ్యం లేకుండా పోయిందని కనీసం... చివరి చూపు కైనా నోచుకోనివ్వండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: