దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన నిర్భ‌య ఘ‌ట‌న‌లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్ 16న ఓ వైద్యవిద్యార్థిని (23)పై సామూహిక లైంగిక దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఓ మైనర్ (17) సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణలో ఉండగానే ప్రధాన నిందితుడైన రామ్‌సింగ్ 2013 మార్చి 11న తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ (17)కు జువెనైల్ జస్టిస్ బోర్డు మూడేళ్ల‌ శిక్ష విధించి బాలనేరస్థుల పాఠశాలకు తరలించింది. అతడు 2015 డిసెంబర్ 20న విడుదలయ్యాడు. మిగతా నలుగురు.. ముకేశ్(29), వినయ్ శర్మ (23), పవన్ (22), అక్షయ్ కుమార్ సింగ్ (31)ను దోషులుగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు విధించిన ఉరిశిక్షను, సుప్రీంకోర్టు ఓకే చేయ‌డం తెలిసిన సంగ‌తే. అయితే, అంద‌రూ అనుకున్న‌ట్లుగా వారికి ఉరిశిక్ష ప‌డే అవ‌కాశాలు లేద‌ని తెలుస్తోంది. 

 

కుళ్లు కంపుకొడుతున్న దిశ శవాలు...మార్చురీలో ఏం జ‌రుగుతోందో తెలుసా?

 

తీహార్ జైలులోనే దోషులను ఉరి తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బక్సర్ జైలు నుంచి ఉరి తాళ్లు కూడా ఆర్డర్ చేశారు. ఇటీవల ఉరితాళ్లను సిద్ధం చేయాలని బక్సర్‌ జైలు అధికారులను కోరిన తీహార్‌ జైలు అధికారులు.. తాజాగా ఇద్దరు తలారీలను పంపాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు యూపీ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ (జైళ్లశాఖ) అనంద్‌కుమార్‌కు ఈ నెల 9న ఓ లేఖ రాశారు. అవసరాన్ని బట్టి సమాచారం తెలియజేయగానే ఇద్దరు తలారీలను పంపాలని ఆ లేఖలో కోరారు. అయితే ఉరిశిక్ష ఎవరికి అమలు చేయనున్నామన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించకపోయినప్పటికీ.. ఉరిశిక్ష పడిన కొంతమంది దోషులు జైలులో ఉన్నారని, దీన్ని తప్పించుకోవడానికి వారికి న్యాయపరంగా, రాజ్యాంగపరంగా ఉన్న అవకాశాలన్నీ మూసుకుపోయాయని పేర్కొన్నారు. దీనిబట్టి నిర్భయ దోషులకే ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

 

సొంత ఇళ్లు కూల్చి..షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం...బాల‌కృష్ణ సంచ‌ల‌న నిర్ణ‌యానికి కార‌ణం ఆయ‌నేనా? 

అయితే, నిర్భయ దోషులకు త్వరగా డెత్ వారెంట్ జారీ చేసి ఉరిశిక్ష అమలు చేయాలని నిర్భయ పేరెంట్స్ వేసిన పిటిషన్ స‌మ‌యంలోనే.. నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు నిందితుల్లో ఒకడైన అక్షయ్‌ సింగ్‌ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. తనకు విధించిన మరణ శిక్షను సమీక్షించాలంటూ అక్షయ్‌ సింగ్‌ తన న్యాయవాది ఏపీ సింగ్‌ ద్వారా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిసెంబర్‌ 17(మంగళవారం)న మధ్యాహ్నం 2 గంటలకు విచారించనుంది. కొత్త జైలు నిబంధనల ప్రకారం.. క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరించిన 14 రోజుల తర్వాతే మరణశిక్ష విధించాల్సి ఉంటుంది. కాబ‌ట్టి అంతా ఊహించిన‌ట్లు....నిర్భ‌య‌పై గ్యాంప్ రేప్ జ‌రిగిన‌ డిసెంబ‌ర్ 16న ఉరి తీయ‌డం సాధ్యం కాదంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: