గత కొన్ని వారాల నుంచి ఉల్లి ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. ఉల్లి దిగుబడి తగ్గిపోవడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగి ఉల్లిధరలు అన్నీ బగ్గుమన్నాయి. దీంతో సామాన్య ప్రజలకు భారంగా మారి పోయింది ఉల్లి .దీంతో  ఉల్లిని కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కాస్తో కూస్తో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఏకంగా 200 రూపాయలకు చేరిన ఉల్లి ధర ప్రజలను బెంబేలెత్తిచ్చింది. దీంతో చాలామంది ఉల్లిపాయలు లేకుండానే వంటలు కానీచ్చేసారు . ప్రభుత్వాలు కూడా పెరిగిన ఉల్లి ధరలతో ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సబ్సిడీపై ఉల్లిని  అందజేయగా... ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న మార్కెట్ల వద్దకు ప్రజలు భారీగా చేరుకోవడంతో తోపులాట ద్వారా ప్రజలకు అక్కడ ఇబ్బందులు తప్పలేదు. కాగా  ఇప్పుడిప్పుడే ఉల్లి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. 

 

 

 

 కొన్ని వారాల నుంచి ప్రజలను బెంబేలెత్తించిన ఉల్లిధరలో క్రమేపీ కొంచెం కొంచెం  తగ్గుతున్నాయి. దాదాపు 200 రూపాయల వరకు చేరిన ఉల్లి ధర... ఇప్పటికే కొంచెం కొంచెం తగ్గుతూ వస్తున్నప్పటికీ... ఇప్పటికి వంద రూపాయల వరకు పలుకుతుంది . కాగా గతంలో ఉల్లి దిగుబడి తగ్గి పోయి ఉల్లి ధర పెరగడంతో ఉల్లికి డిమాండ్ పెరగగా...  ప్రస్తుతం ఉల్లి పంటలు అందుబాటులో వస్తుండటం సహా ఎగుమతులపై నిషేధం విధించడం లాంటి కారణాలతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో  ఉల్లి ధర తక్కువ  పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాలకు ఎగుమతి నిలిపి  వేయడంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకోవడంతో ఉల్లి ధర తగ్గుతూ వస్తుంది. 

 

 

 

 అయితే కేవలం కొత్తగా దిగుమతి చేసుకున్న ఉల్లి  మాత్రమే వంద రూపాయల లోపు పలుకుతుంది కానీ పాత ఉల్లి  మాత్రం వంద రూపాయల పైనే పలుకుతుంది. రెండు మూడు వారాల నుంచి స్టాక్  ఉన్న  పాత ఉల్లి ధర మాత్రం తగ్గకపోవడం  గమనార్హం. అయితే  భారీగా కురిసిన  వర్షాలతో అంత జలమయమై పంట దెబ్బ తింది దీంతో ఉల్లి దిగుబడి తగ్గిపోయి డిమాండ్ ఏర్పడింది. కాగా  ఇప్పుడు ఉల్లి పంట లు అందుబాటులోకి వస్తుండడంతో ఉల్లి ధర తగ్గుముఖం పడుతూ వస్తుంది. ఇక అటు కర్నూల్ లో కూడా ఉల్లిని  ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయకుండా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రజలకు ఉల్లి  అందుబాటులో ఉంటుంది. కాగా ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీపై కేవలం ఇరవై ఐదు రూపాయలకే ఉల్లి ని అందజేస్తుండగా..  ఇక అటు బహిరంగ మార్కెట్లో మాత్రం ఎనభై ఐదు రూపాయల చొప్పున ఉల్లి అమ్మకాలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: