2007వ సంవత్సరం డిసెంబర్ 27న విజయవాడ లోని శ్రీ దుర్గ లేడీస్ హాస్టల్ లో ఆయేషా మీరా అనే అమ్మాయి దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన తెలిసి తెలుగు రాష్ట్రాలు మొత్తం షాకయ్యాయి. ఆ హాస్టల్ వార్డెన్ ఆయేషా మీరా శవాన్ని చూసి పోలీసులకి సమాచారం అందించారు. దాంతో పోలీసులు దర్యాప్తు చేసి ఏడాది తర్వాత సత్యంబాబు అనే వ్యక్తిని పట్టుకున్నారు. అతను ఆయేషాను హతమార్చినట్లు ఒక వీడియో ద్వారా కూడా తెలియపరిచాడు. సత్యంబాబు చెప్పినట్లు పోలీసులు కీలక ఆధారాలని సాధించి న్యాయస్థానంలో చూపించారు. దాంతో అతనికి 2010లో విజయవాడ మహిళ కోర్టు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అప్పటి నుంచి సత్యంబాబు రాజమండ్రి జైలులో శిక్షను అనుభవించాడు.


కానీ ఆయేషా మీరా తల్లి కొన్ని నెలల సొంతంగా తన బిడ్డ హత్య గురించి విచారణ చేపట్టి కొన్ని విషయాలను రాబట్టింది. ఆ తర్వాత పోలీసులు చెప్పే స్టోరీ నమ్మశక్యంగా లేదని.. సత్యంబాబు అమాయకుడని చెప్పారు.. శ్రీ దుర్గా లేడీస్ హాస్టల్ మాజీ కోనేరు రంగారావు యొక్క మనవడి కోనేరు సతీష్ బినామీదని చెప్పింది. ఆమె చెప్పిన ప్రకారం,... కోనేరు సతీష్ ఆయేషా మీరా ఉంటున్న హాస్టల్ కి అప్పుడప్పుడూ వచ్చి కొంత మంది అమ్మాయిలతో లైంగికంగా సంతృప్తిని పొందేవాడు. అయితే ఆయేషా మీరా హత్య జరిగిన ముందు రోజు ఒక పార్టీ జరిగింది. అందులో కోనేరు సతీష్ పాల్గొన్నారు... దాంతో ఆయేషా.. మగవాళ్లు ఎందుకు వస్తున్నారు మన హాస్టల్ కు అని తన స్నేహితులని అడిగింది. ఆ విషయం కోనేరు సతీష్ కు తెలిసింది. దాంతో సతీష్ చేసే కార్యకలాపాలు ఎక్కడ బయట పడతాయోననే ఉద్దేశంతో..ఒక అర్ధరాత్రి ఆయేషా మీరా పడుకున్న గదికి వచ్చి ఆమె తలను గది యొక్క తలుపుకు గట్టిగా మోది చంపేశారని తన తల్లి కోర్టు కు చెప్పింది. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయండని కోర్టును కోరింది. 




దాంతో మళ్లీ విచారణ చేసిన తర్వాత...కొంతమంది పోలీసులు కొట్టడం వలనే ఆ వీడియో లో సత్యంబాబు అలా చెప్పాడని, అతను నిర్దోషి అని తేలింది. దీంతో ఎనిమిది సంవత్సరాలు గడిచిన తర్వాత హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా తేల్చి విడుదల చేసింది. కానీ ఆయేషా తల్లి చెప్పిన విధంగా కోనేరు సతీష్ హత్య చేశాడని చెప్పడానికి ఏ ఆధారాలు దొరకలేదని పోలీసులు చెప్పారు. దాంతో ఇంతవరకూ ఆయేషాను హతమార్చిన వారిని పోలీసులు పట్టుకోలేకపోయారు. ఆయేషా మీరా తల్లి... కోనేరు సతీష్ హత్య చేశాడని... పొలిటికల్ సపోర్ట్ ఉండటం వలన అతన్ని పోలీసులు అరెస్ట్ చేయట్లేదని చెప్పింది. సో, అస్సలు విషయాన్ని కనిపెట్టడానికి ప్రభుత్వం ఆయేషా హత్య కేసును
సి.బి.ఐ కు అప్పగించింది.

ఈ క్రమంలోనే... కొద్దినెలల క్రితం.. సిబిఐ అధికారులు ఆయేషా బాడీకి మళ్ళీ శవపరీక్ష చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల వారి ప్రయత్నం విఫలమయింది. అయితే తాజాగా మళ్ళీ సిబిఐ అధికారులు శవపరీక్ష నిర్వహించాలని భావిస్తున్నారని...ఆ మేరకు స్థానిక అధికారులను సంప్రదించారని సమాచారం. ప్రస్తుతం రీ-పోస్టుమార్టంకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు సమాచారం. డిసెంబర్ 20 లోపు ఈ రీ-పోస్టుమార్టం ప్రక్రియ పూర్తవుతుందని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: