ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలల్లో వైకాపా పార్టీ భారీ విజయం సొంతం చేసుకుంది.  ఏకంగా 151 స్థానాలు గెలుచుకొని ఎవరూ సాధించలేని రికార్డును సొంతం చేసుకుంది వైకాపా.  ఇలాంటి చిరస్మరణీయ విజయం అందుకున్న వైకాపా అదే రేంజ్ లో పనులు చేసేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే.  ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చారు.  దీనిని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.  


ఇందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ముసలి ముతక వాళ్లకు ఇచ్చే పింఛన్ పధకం ఏకంగా పెంచేశారు.  పెంచడమే కాకుండా, నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత వైకాపా సొంతం చేసుకుంది.  అధికారంలోకి వచ్చిన రెండు మూడు నెలల్లోనే ఈ స్థాయిలో ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు కల్పించలేదు.  మొదటి 100 రోజులు ప్రతి ఒక్కరు పాలనపై కాకుండా అధికారంలో ఉండే లోటు పాట్లపైన.. అధికారాలు కల్పించే విషయంపైనా దృష్టి పెడతారు.  


కానీ, అలా కాకుండా, జగన్ ఎన్నికల్లో గెలిచి అధికారం చేజిక్కించుకున్న వెంటనే జగన్ పాలనపై దృష్టి పెట్టారు.  ఆరు నెలల్లో మంచి సీఎంగా పేరు తెచ్చుకోవాలని అనుకున్న జగన్ అంతకంటే మంచి పేరు తెచ్చుకున్నారు.  ఈ విషయాన్ని వైకాపా నేతలు, కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా మెచ్చుకున్నారని వైకాపా నేత కాటంరెడ్డి పేర్కొన్నారు.  


వైకాపా పథకాలకు ప్రజలు ఫిదా అవుతున్నారు.  ఇప్పటికే అనేక పధకాలు ప్రవేశపెట్టింది.  వైకాపా ప్రవేశపెట్టిన పధకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి.  దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు మండిపోతున్న సమయంలో కూడా వైఎస్ జగన్ సర్కార్ రూ. 25 కే ఉల్లిని అందించింది. ఒక్క ఉల్లిపాయలనే కాదు.. ఎన్నో రకాల పధకాలను జగన్ ప్రవేశపెట్టి వాటిని సమర్ధవంతంగా అమలు చేస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్ 2019 ను ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారని కాటం రెడ్డి పేర్కొన్నారు.  అసెంబ్లీలోను, రాజకీయాల్లోనే జగన్ ఎప్పుడు నెంబర్ 1 అని ప్రజలు అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: