నిన్న అసెంబ్లీ గేట్ దగ్గర మార్షల్స్ కు టీడీపీ నేతలకు మధ్య జరిగిన ఘర్షణ గురించి అసెంబ్లీ అట్టుడికింది. టీడీపీ నేతలు మార్షల్స్ తనపై దాడి చేసారంటూ అసెంబ్లీలో నినాదాలతో హోరెత్తించారు. సభలో నినాదాలతో ఉద్రికత్త నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని టీడీపీ నేతల విమర్శలకు స్పందించారు. 

 

"రోజూ చంద్రబాబు వచ్చే గేట్ నుంచి రాకుండా కావాలనే కొంత మంది ఎమ్యెల్సీలను మరియు నేతలను కలుపుకొని అసెంబ్లీ గేట్ దగ్గరకు వచ్చి కావాలనే మార్షల్స్ తో గొడవకు దిగారు. గుంపులో ఎవరు ఎమ్యెల్యే నో తెలియక మార్షల్స్ ఒక్కొక్కరిని గేట్ నుంచి రావాల్సిందిగా కోరారు దీనితో అక్కడ ఉన్న చంద్రబాబు తనయుడు లోకేష్ నాయుడు మార్షల్స్ ను కొట్టారు. చీఫ్ మార్షల్ ఆఫీసర్ పై చేయి చేసుకున్నారు లోకేష్. చంద్రబాబు కూడా ఆఫీసర్స్ పై తీవ్ర పదజాలంతో దూషించారు" అని మంత్రి కొడాలి నాని చెప్పారు. 

 

ఈనాడు పేపర్ టీడీపీ పార్టీ పెట్టకముందే మీరు చెప్తున్నారు కదా! ఎన్టీఆర్ పేరు చెప్పుకుని ఈనాడు పేపర్ లాభపడింది ఎన్టీఆర్ వల్ల ఈనాడు బాగుపడింది కానీ ఈనాడు పేపర్ వల్ల ఎన్టీఆర్ బాగుపడలేదు అని చెప్పారు. అప్పట్లో రాజకీయ సంక్షోభం సృష్టించి వైస్రాయ్ హోటల్ లో కేవలం 10 మంది ఎమ్యెల్యేలతో ఉన్న నువ్వు 165 మంది ఎమ్యెల్యేల మద్దతు ఉందని ఈనాడులో  రాయించుకున్నారు. టీడీపీ లో ఒక పందికొక్కుల దూరి పార్టీ ని నాశనం చేశారు అని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

నిన్న చేసిందంతా చేసి ఏమీ ఎరగనట్లు ఇక్కడికి వచ్చి సిగ్గు లేకుండా నాటకాలు ఆడుతున్నారు చంద్రబాబు అని మంత్రి కొడాలి నాని చంద్రబాబు పై చిందులు తొక్కారు. జగన్ కి కేవలం 35 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఎంతో పరిణితి కలిగిన నాయకుడిగా వ్యవహరిస్తున్నారని జగన్ ను చూసి బాబు నేర్చుకోవాలని సూచించారు నాని. 

మరింత సమాచారం తెలుసుకోండి: