అసెంబ్లీలో చంద్రబాబునాయుడుకు ఇపుడు జరిగినంత అవమానం గతంలో ఎప్పుడూ జరిగుండదు.  తన తొందరపాటు తనంతో మార్షల్స్ పై నోరు పారేసుకున్న పాపానికి నిండు సభలో చంద్రబాబు తలొంచుకోవాల్సొచ్చింది. గురువారం అసెంబ్లీలోకి వచ్చేముందు చంద్రబాబు, లోకేష్ తదితరులకు అసెంబ్లీ చీఫ్ మార్షల్ తో పెద్ద గొడవ జరిగింది.  ఆ సందర్భంలో  చంద్రబాబు, చినబాబు చీఫ్ మార్షల్ ను కానీ ఇతర భద్రతా సిబ్బందిని కానీ నోటికొచ్చినట్లు మాట్లాడారు.

 

చంద్రబాబు బయట ఎక్కడో మాట్లాడినట్లుగానే చీఫ్ మార్షల్ ను ఉద్దేశించి నీచమైన పదాలతో తిట్టారు.  ఈ విషయం శుక్రవారం సభ ప్రారంభం కాగానే ప్రస్తావనకు వచ్చింది. చీఫ్ మార్షల్ ను పట్టుకుని బూతులు తిట్టినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాధరెడ్డి, కన్నబాబు తదితరులు పట్టేబట్టారు.

 

చంద్రబాబు మాట్లాడుతూ తాను చీఫ్ మార్షల్ ను ఏమీ తిట్టలేదని వాదించారు. దాంతో గురువారం జరిగిన గొడవలో ఎవరు ఎవరిని ఏమన్నారనే విషయాన్ని ఒకటికి పదిసార్లు వీడియో క్లిప్పుంగులను ప్రదర్శించారు. దాంతో చీఫ్ మార్షల్ ను చంద్రబాబు బూతులు తిట్టిన విషయం స్పష్టంగానే వినిపించింది. అయినా సరే తాను బూతులు తిట్టలేదనే చంద్రబాబు బుకాయించారు.

 

ఎప్పుడైతే చంద్రబాబు తన చర్యను అడ్డంగా సమర్ధించుకున్నారో వెంటనే బుగ్గన జోక్యం చేసుకుని  చంద్రబాబు గనుక క్షమాపణ చెప్పకపోతే సభ తీసుకునే చర్యలకు బద్దుడై ఉండాలని హెచ్చరించారు. బుగ్గన పదే పదే హెచ్చరించినా ఉపయోగం కనబడలేదు. దాంతో చివరకు చంద్రబాబు మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారాన్ని స్పీకర్ నిర్ణయానికే వదిలిపెడుతూ తీర్మానించారు.

 

అసలు తాను రావాల్సిన గేటులో నుండి కాకుండా సభ్యులందరూ వచ్చే దారిలో రావటమే చంద్రబాబు తప్పు. ఇలా ఎందుకొచ్చారంటే గొడవలు పెట్టుకునేందుకే అని అర్ధమైపోతోంది. గొడవలు పెట్టుకోవటమే కాకుండా భద్రతా సిబ్బందిని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ బూతులుతిట్టటం మరోతప్పు. బూతులు తిట్టినందుకు క్షమాపణలు చెప్పమని సభ అడిగితే తన చర్యలను సమర్ధించుకోవటమే చివరి తప్పు. దాంతో చంద్రబాబు విషయంలో స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో అన్నది ఉత్కంఠ రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: