వీడియో ఆడియో సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత కూడా చంద్రబాబునాయుడు ఇంకా అడ్డంగా బుకాయిస్తున్నారు. గురువారం అసెంబ్లీలోకి ఎంటరయ్యే ముందు చంద్రబాబు, టిడిపి సభ్యులకు అసెంబ్లీ భద్రతా సిబ్బందితో గొడవైన విషయం అందరికీ తెలిసిందే. ఆ గొడవలో చీఫ్ మార్షల్ ను పట్టుకుని చంద్రబాబు బాస్టర్డ్ అంటూ తిట్టారు. ఈ విషయపైం గురువారమే అసెంబ్లీలో వీడియో క్లిప్పింగులను ప్రదర్శించినా ఎవరూ నోటిసు చేయలేదు.

 

 శుక్రవారం సభ ప్రారంభం కాగానే ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. చీఫ్ మార్షల్ ను నోటికొచ్చినట్లు తిట్టటం చాలా అభ్యంతరకరమన్నారు. సరే తర్వాత చాలామంది మంత్రులు, సభ్యులు కూడా మాట్లాడారు. అయితే చంద్రబాబు మాత్రం తాను ఎవరినీ ఏమీ తిట్టలేదని సమర్ధించుకున్నారు. దాంతో మంత్రుల సూచన మేరకు అదే వీడియో క్లిప్పింగులను అసెంబ్లీలో ఒకటికి పదిసార్లు ప్రదర్శించారు. దాంట్లో చీఫ్ మార్షల్ ను  చంద్రబాబు తిట్టటం వినబడింది.

 

ఇన్నిసార్లు వీడియో క్లిప్పింగులను ప్రదర్శించినా తాను తిట్టలేదని చంద్రబాబు బుకాయించారు. ఎదురుగా తాను తిట్టినట్లు ఆడియో, వీడియో క్లిప్పింగుల్లో కనబడుతున్నా చంద్రబాబు అడ్డంగా బుకాయించటమే ఆశ్చర్యంగా ఉంది. పైగా తన చర్యను సమర్ధించుకుంటు గతంలో తనను జగన్ అన్న మాటలను, తనను మంత్రి కొడాలి నాని అన్న మాటలను ప్రస్తావించటమే ఇంకా విచిత్రం.

 

ఇక్కడ సమస్యేమిటంటే జగన్ అయినా కొడాలి నాని అయినా చంద్రబాబును కానీ టిడిపి సభ్యులను కానీ అన్న మాటలతో  అసెంబ్లీకి సంబంధం లేదు. ఎందుకంటే అవన్నీ బహిరంగసభల్లోను, మీడియా సమావేశాల్లోను అన్న మాటలు. వీళ్ళన్నట్లే చంద్రబాబు కానీ టిడిపి నేతలు కానీ జగన్ ను నోటికొచ్చినట్లు మాట్లాడుతునే ఉన్నారు. అసెంబ్లీ బయట చంద్రబాబు మాట్లాడిన మాటలను తిట్టిన తిట్లను అధికారపార్టీ ప్రస్తావించటం లేదు. అసెంబ్లీలో లోపల చీఫ్ మార్షల్ ను తిట్టిన తిట్టను మాత్రమే వైసిపి ప్రస్తావిస్తోంది. దాంతో ఏమి సంబంధం చెప్పాలో అర్ధంకాని చంద్రబాబు చివరకు బుకాయించి తప్పించుకోవాలని చూస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: