జనసేన పార్టీ నుండి గెలిచిన ఒక్క ఎమ్మెల్యే అయిన రాపాకవరప్రసాద్ కూడా అధినేత మాటలతో విభేదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది .దీనికి ఉదాహరణగా గత మూడు రోజులుగ అసెంబ్లీ లో రాపాక వరప్రసాద్ మాటలుతున్న మాటలు చూస్తుంటే అర్థం  అవుతుంది . రెండు రోజుల క్రితం ఏపీ లో ఆంగ్ల మద్యం గురించి చర్చ జరిగినపుడు ఆ విషయం గురించి మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు మంచి ఎవరు చేసిన స్వాగతించాలి అని అయన మాట్లాడారు .

 

ప్రభుత్వం ఆంగ్లమాధ్యమాన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెట్టడం వళ్ళ ఆర్థికంగా ఇబ్బంది ఉన్న పేద విద్యార్ధులకి   చాల ఉపయోగకరమని వ్యాఖ్యానించారు,కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్నారు తాజాగా ఇదే రీతిలో  రాపాక పవన్ కళ్యాణ్ ఫై వ్యాఖ్యలు చేసాడు  ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ చీఫ్‌ పవన్‌కల్యాణ్‌ ఏ కార్యక్రమం చేసినా ఆ పది మంది మాత్రమే వస్తారని వ్యాఖ్యానించారు. ప్రతి చిన్న విషయానికి ధర్నాలు, సభలు సరికాదన్నారు.

 

ముందు ముందు పవన్‌కల్యాణ్‌ సభలకు ఆదరణ తగ్గిపోతుందన్నారు. రాపాక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.ఇదే సమయం లో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు జనసేన షోకాజ్ నోటీసు ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే తాము రాపాకకు ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదని ఆ పార్టీ వివరణ ఇచ్చింది. కానీ జనసేన ఈ ప్రకటన చేసేలోపుగానే రాపాక టంగ్ స్లిప్ అయ్యారు.

 

పవన్ కళ్యాణ్‌పై గట్టిగానే విమర్శలు చేశారు. తాను గెలిచిన ఎమ్మెల్యేనని... తనకు ఓడిపోయిన వాళ్లు షోకాజ్ నోటీసు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పార్టీ మీద ఏదైనా అధికారం అనేది ఉందంటే అది తనకు మాత్రమే అని ఆయన కామెంట్ చేశారు. తాను ఎవరి భిక్షతోనూ ఎమ్మెల్యే కాలేదనీ... సొంత శక్తి తో ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు.

 

తనను గెలిపించే వాళ్లే అయితే ఆయన ఎందుకు ఓడిపోయారు రెండు చోట్లా? అని పవన్ కళ్యాణ్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారు. దిశానిర్దేశం లేని పార్టీలో ఉండటం తనకు ఇష్టం లేదని... రాజీనామా చేసి మళ్ళీ గెలిచే శక్తి తనకు ఉందని ఆయన అన్నారు.ఈ వ్యాఖ్యల కారణంగా అయినా ఇప్పుడు రాపాకకు షోకాజ్ ఇవ్వక తప్పని పరిస్థితి జనసేనకు నెలకొందని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: