అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వైసిపి సభ్యులు చెబుతున్న మాటలు నిజమే అనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత చంద్రబాబునాయుడులో మానసికంగా స్పష్టమైన మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తనను జనాలు చిత్తుచిత్తుగా ఓడిగొట్టారు అన్నది ఓ సమస్య అయితే  జగన్మోహన్ రెడ్డి అఖండ మెజారిటితో సిఎం అయ్యారనే సమస్య రెండోది. రెండు సమస్యలు కలిసి ఒకేసారి చంద్రబాబును మానసికంగా దెబ్బ తీస్తోంది.

 

లేకపోతే  బయట మీడియా సమావేశాల్లో మాట్లాడినట్లే అసెంబ్లీలో కూడా జగన్ పై బురద చల్లాలని ప్రయత్నిస్తే చూస్తు ఊరుకుంటారా ? మీడియా సమావేశాల్లో జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడటం అలవాటైపోయింది. సరే అలా మాట్లాడినా వైసిపి నుండి ఎవరైనా కౌంటర్ ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు. కానీ బయట మాట్లాడినట్లే 22 మంది ఎంఎల్ఏల బలమున్న చంద్రబాబు 150 మంది ఎంఎల్ఏలున్న జగన్ పై అసెంబ్లీలో కూడా నోరు పారేసుకుంటే ఎలా కుదురుతుంది ?

 

నిండు సభలో జగన్ పైనో లేకపోతే ప్రభుత్వంపైన  బురద చల్లాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు బెడిసికొడుతున్నాయి. ఎందుకంటే ఎదురుగా ఉన్న జగన్ అండ్ కో చంద్రబాబును వాయించేస్తున్నారు. ఇపుడు జగన్ ను ఏ విషయాల్లో అయితే చంద్రబాబు తప్పు పడుతున్నారో అవే విషయాలను తన ఐదేళ్ళ హయాంలో కంపు చేసేశారు. ఇపుడు వైసిపి ప్రభుత్వం ఎదుర్కొంటున్న చాలా దరిద్రాలకు చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నపుడు చేసిన నిర్వాకాలే కారణం.

 

స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టటం, మీడియాపై ఆంక్షలు విధించటం, జీవో నెంబర్ 2430 అమలు లాంటి అనేక అంశాలపై చంద్రబాబు వైసిపిని కెలుక్కుని చెత్త నేత్తినేసుకుంటున్నారు. అందుకనే తనముందు నిలబడి మాట్లాడేందుకు కూడా సాహసం చేయలేని జూనియర్ ఎంఎల్ఏలు కూడా చంద్రబాబును ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు మాట్లాడుతున్నది నిజాలే కాబట్టి తిరిగి చంద్రబాబు సమాధానం కూడా చెప్పలేకపోతున్నారు. అందుకే చంద్రబాబుకు చాదస్తం పెరిగిపోయిందని అనుకుంటున్నది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: