శంషాబాద్ లో జరిగిన దిశ అత్యాచారం మరియు హత్య తరువాత  దేశమంతా కుటుంబాలలో ఒక రకమైన భయం మొదలైంది అందుకు గాను స్త్రీలకు  మరియు బాలికలకు  అవగాహనా కార్యక్రమాలు నిర్విహిస్తున్నారు.దీనిలో భాగంగా  లైంగిక వేధింపులపై షీటీమ్స్‌ వివిధ పాఠశాలల్లో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి.

ఇటీవల  జరిగిన ఒక సంఘటన బయటపడింది సైబరాబాద్‌ పరిధిలోని ఓ ప్రైవేట్‌ బడిలో అవగాహన కార్యక్రమం నిర్వహించి వారికీ కొన్ని మెళుకువలు నేర్పించారు 11 ఏళ్ల బాలిక లేచి మాట్లాడుతూ తనకు ఇప్పటి వరకు గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌ మధ్య తేడా తెలియదని ఈ కార్యక్రమం ద్వారా కొంచం అవగాహనా వచ్చింది అని మా పక్కింటి అంకుల్‌ ప్రతీరోజూ తనతో ప్రవర్తిస్తున్న తీరు బ్యాడ్‌ టచ్‌ అని ఇప్పుడు తెలిసిందని చెప్పింది.

స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్లగానే అతను ప్రేమగా పిలిచేవాడని తన ఫోన్‌లో వీడియోలను చూపించేవాడని, శరీర భాగాలను తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడని చెప్పింది. ఈ విషయం ఎవరికీ చెప్పలేదని కన్నీటి పర్యంతమైంది. ఇలాంటి పరిస్థితి చాలామందికి ఎదురై ఉంటుందని ఇలాంటి కార్యక్రమం ద్వారా వారికీ అర్ధం అవుతుందని ఆవేదనను వ్యక్తం చేసింది. ఆమె ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించి ఆ వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేశారు. అదే విదంగా నవంబరు డిసెంబర్ లలో సైబరాబాద్‌ షీటీమ్స్‌కు మొత్తం 190 ఫిర్యాదులకు పైగా  అందాయి అని పేర్కొన్నారు. వాటిలో 67 మందిపై కేసులు నమోదు చేశారు. కళాశాలలు, పాఠశాలలు, కమ్యూనిటీ సెంటర్లలో 164 అవగాహన సదస్సులు నిర్వహించి 32,800 మందికి అవగాహన కల్పించారు.అయితే ప్రతి కళాశాలలో మరియు పాఠశాలలో ఎలాంటి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఉపయోగకరం అని అనిపిస్తుంది. ఈ సంఘటన అనంతరం షీ టీం వాళ్లకు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల్లో ఇలాంటి పరిస్థితి ఆడ పిల్లలు ఎదుర్కొంటున్నారు అంటే సమాజం లో ఆడపిల్లలు ఏ పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నారని...

 

మరింత సమాచారం తెలుసుకోండి: