వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు.  అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ పథకంపై సంతకం చేసి గుడ్ న్యూస్ చెప్పిన జగన్ అదే రోజున మరిన్ని 4 లక్షల ఉద్యోగాల రూపకల్పనకు శ్రీకారం చుట్టినట్టుగా జగన్ చెప్పిన సంగతి తెలిసిందే.  చెప్పినట్టుగానే జగన్ 2.5 లక్షల ఉద్యోగాలు గ్రామ వాలంటీర్లు, 1.5 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగాలు కల్పించారు. ఇందులో ఇంకా కొన్ని పోస్టులు మిగిలే ఉన్నాయి.  


వీటిని కూడా త్వరలోనే పూర్తి చేయబోతున్నారు.  అక్కడితో ఆగిపోలేదు.. ఎన్నో పధకాలు రైతులకు, కర్షకులకు, కార్మికులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు ఎన్నో రకాల పధకాలు ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తూ జగన్ శభాష్ అనిపించుకున్నాడు.  జగన్ చేస్తున్న మంచి పనులకు ప్రజల వద్ద నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.  జగన్ ఇప్పుడు ప్రజల గుండె చప్పుడుగా మారిపోయాడు.  జగన్ నడిచే దేవుడిగా పేరు తెచ్చుకున్నారు.  


ఆరోగ్యశ్రీ పధకం కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా, పొరుగున ఉన్న రాష్ట్రాల్లో కూడా అమలు జరిగేలా చర్యలు తీసుకున్నారు.  ఎపి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడ కూడా వైద్యం చేయించుకోవచ్చు.  ఇక ఇదిలా ఉంటె, జగన్ పాలన విషయంలో, అధికారం విషయంలో సమన్యాయం పాటిస్తున్నారు.  మంత్రి పదవులు విషయంలోనూ ఇదే విధమైన సమన్యాయం పాటించారు.  


ఇదిలా ఉంటె, వచ్చే ఏడాది మార్చి నెలలో రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఈ రెండు ఎమ్మెల్సీ సీట్లు మైనారిటీ వర్గాలకు ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.  అంతేకాదు, ఈ రెండు సీట్లు మైనారిటీలైన మహిళలకు ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.  దీనిపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  జగన్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సమన్యాయం చేస్తోందని, మహిళలకు పెద్దపీట వేస్తోందని వైకాపా మహిళా నేతలు అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: