అసెంబ్లీ సమావేశాల్లో  మంత్రి కొడాలి నాని సంచలన విషయాన్ని బయటపెట్టారు. చంద్రబాబునాయుడు ఈనాడు సంస్ధలో పనిచేస్తున్న ఉద్యోగిగా ప్రకటించారు.  తాను చేసే తప్పుడు పనులను సమర్ధించుకోవటానికే ఈనాడు లాంటి పత్రికల యాజమాన్యాలు తమ తప్పుడు పనులను సమర్ధించటానికే చంద్రబాబును  ఉద్యోగిగా పెట్టుకున్నట్లు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జగన్ 16 మాసాలు జైల్లో ఉన్నారంటూ రామానాయడు చేసిన అసందర్భ వ్యాఖ్యలకు కొడాలి జవాబిచ్చారు.

 

ఈనాడు దినపత్రిక యాజమాన్యంతో చంద్రబాబుకున్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. మారిన పరిస్ధితుల్లో ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ సంస్ధతో పాటు మరికొన్ని సంస్ధలు కూడా చంద్రబాబుకు మద్దతుగా నిలబడ్డాయి. మీడియాలోని కొన్ని యాజమాన్యాలు కూడా చంద్రబాబును రక్షించటమే తమ లక్ష్యంగా పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.  

 

అదే విషయాన్ని కొడాలి అసెంబ్లీలో ప్రస్తావించారు. ఎన్టీయార్ ను అడ్డం పెట్టుకుని ఈనాడు యాజమాన్యం పత్రిక సర్క్యులేషన్ ను 60 వేల నుండి 3 లక్షలకు పెంచుకున్నట్లు చెప్పారు. ఎన్టీయార్ ను ఉపయోగించుకుని పత్రిక ఎదిగిందే కానీ పత్రిక అవసరం ఎన్టీయార్ కు ఏనాడూ రాలేదన్నారు.  ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుకు ఈనాడు పత్రిక ఉపయోగపడిందంటూ మండిపడ్డారు.

 

కాంగ్రెస్ తో విభేదించిన తర్వాతే జగన్ పై కేసులు పెట్టి 16 మాసాలు జైల్లో పెట్టిన విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసన్నారు. జైల్లో నుండి బయటకు వచ్చిన తర్వాతే జనాలు జగన్ కు అఖండ మెజారిటితో అధికారాన్ని అప్పగించిన విషయాన్ని టిడిపి మరచిపోకూడదన్నారు. చంద్రబాబు లాగ ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కోలేదన్న విషయాన్ని టిడిపి మరచిపోకూడదంటూ చురకలంటించారు. ఎల్లోమీడియాతో ఉన్న సంబంధాల వల్లే చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన 2430 జీవోకు వ్యతిరేకిస్తున్నట్లు మండిపడ్డారు. నిజానికి వాస్తవాలు రాసే ఏ మీడియాకు కూడా ఈ జీవో వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: