ఐదవ రోజు జరుగుతున్న ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో తాజాగా టీడీపీ... మార్షల్స్ మధ్య జరిగిన ఘర్షణ గురించి వాడి వేడి చర్చ జరిగింది. అయితే... చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మార్షల్స్ లను అవమానకర పదజాలంతో దూషించారు. వీడియో క్లిప్పులు ప్లే చేసిన తర్వాత చంద్రబాబు, నారా లోకేష్ మాట్లాడిన తీరును అసెంబ్లీ సభ్యులంతా చూశారు. దాంతో... గౌరవ ప్రభుత్వ ఉద్యోగులను అలా అనడం సరికాదని.. చంద్రబాబు నాయుడు కచ్చితంగా క్షమాపణ చెప్పాలని ప్రభుత్వం నిలదీసింది. స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా... ఆ రకంగా మాటలు అన్నందుకు పశ్చాత్తాపం వ్యక్తంచేసి గౌరవం నిలబెట్టుకోవాలని సూచించారు.


ఇక చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ...బుద్ధి జ్ఞానం ఉందా అని తనని  ప్రస్తుత ముఖ్యమంత్రి అన్నారని, ప్రతి రోజు క్రమం తప్పకుండా తనని ముఖ్యమంత్రి బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రి పదవిలో ఉన్న సమయంలో... ప్రస్తుత ముఖ్యమంత్రి తనని ఉరితీయాలని అన్నారని పెదవి విరిచారు. ఒక మంత్రి మాత్రం తనని ఎంతో ఘోరంగా అవమానించారని చెప్పారు. ప్రతిరోజు అనేక రకాలుగా ఎంతగానో అవమానిస్తున్నారంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. అసెంబ్లీ గేటు దగ్గర..మార్షల్స్ లను టీడీపీ ని అడ్డుకునే విధంగా చేశారన్నారు. గతంలో వైసిపి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము ఈ రకంగా ప్రవర్తించలేదని తెలిపారు.


అధికార పార్టీ నేతలు పనిగట్టుకొని మరి తనను అవమానిస్తున్నారని, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని.. ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసమే పోరాడతానని... అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా తాను ముందుకు నడుస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇంకా మాట్లాడుతూ... 14 సంవత్సరాలుగా తాను ముఖ్యమంత్రిగా పని చేశానని... అటువంటి తనను అసెంబ్లీ లోకి రానివ్వనికుండా.. తీవ్ర బాధకు గురి చేశారని చెప్పుకొచ్చారు. ఆ బాధ లోనే కొంచెం కోపంగా మాట్లాడాను తప్ప మరి ఏ ఉద్దేశంతో కాదని చంద్రబాబు అన్నారు. తనకి అసెంబ్లీలో అడుగు పెట్టే హక్కు ఉందని.. ఆ హక్కుతోనే గట్టిగా ప్రశ్నించానని.. ఆ సందర్భంలోనే వాట్ నాన్సెన్స్ అన్నానని చెప్పారు. తనకి పౌరుషంగా మాట్లాడడం రాదని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: