ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళల భద్రత కోసం దిశ అనే కొత్త  చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా నేడు శీతాకాల సమావేశాల్లో భాగంగా ఏపీ అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాక్ట్ పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ వేదికగా మాట్లాడిన పుష్పశ్రీవాణి దిశ యాక్ట్ పై ప్రశంసలు కురిపించారు. ఏపీ ప్రభుత్వం తీసుకు వస్తున్న దిశ యాక్ట్  కి ఒక డిప్యూటీ సీఎం లాగే కాకుండా ఒక సాధారణ మహిళ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఆమె అన్నారు. దిశా ఘటన తర్వాత కొంతమంది ప్రకటనలకు పరిమితమై పోయారని... కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో  మాత్రం దేశానికి దిశా నిర్దేశం చేసే చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది అని  ఆమె అన్నారు . 

 


 మహిళా పక్షపాతి అయిన జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నేతృత్వంలోని మంత్రివర్గంలో ఒక గిరిజన మహిళ అయినా తనకు డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చినందుకు గర్వపడుతున్నాను అంటూ ఆమె తెలిపింది. ఇంత గౌరవప్రదమైన హోదాను తనకు కట్టబెట్టినందుకు జీవితాంతం జగనన్నకు  రుణపడి ఉంటాను అంటూ వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దిశా యాక్ట్ మహిళల్లో నమ్మకాన్ని కలిగించిందని ఆమె వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాక్ట్ వల్ల న్యాయస్థానంలో న్యాయదేవత కళ్ళకు గంతలు తెరుచుకుని ఆది పరాశక్తిగా మారి... ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులను కఠినంగా శిక్షిస్తుందన్న నమ్మకం మహిళల్లో ఏర్పడిందని ఆమె తెలిపారు. 

 

 

 రాక్షసులు లాంటి కామాంధుల చేతిలో బలైపోతున్న మహిళల్లో... ఈ చట్టం నమ్మకాన్ని నింపుతుంది అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అయితే మహిళల పట్ల జరుగుతున్న ఘోరాలను నేరాలను అరికట్టడానికి కోసం ఇప్పటికే ఎన్నో కఠిన చట్టాలు వచ్చినప్పటికీ వాటి ద్వారా మహిళలకు మాత్రం ఎక్కడ న్యాయం జరగలేదు  దీనితో ప్రజల్లో చట్టాల పై నమ్మకం పోయిందని పుష్ప శ్రీవాణి అన్నారు. దిశను చంపిన మృగాలకు ... కుక్క చావు వచ్చేలా చెయాలంటూ దేశం మహిళా లోకం కోరుకున్నదని  ఆమె అన్నారు. నలుగురు మృగాల్లాంటి  రాక్షసులను ఎన్కౌంటర్ చేసిన పోలీసులను శభాష్ అంటూ మహిళాలోకం మెచ్చుకుంది పుష్పశ్రీవాణి వ్యాఖ్యానించారు. ఆడపిల్లలపై అఘాయిత్యాల నిర్ములనకు  ఏపీ ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చినా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: