రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ పార్టీ రంగులు ప్రభుత్వ కార్యాలయాలు ఆఫీసులకు వేసి చమక్కు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్ని ప్రభుత్వ కార్యాలయాల రంగులను పసుపు పచ్చ రంగు లోకి మార్చేశాయి. ఇక ఇప్పుడు 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో సొంతం చేసుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఆఫీసులకు వైసిపి రంగులు వేయిస్తుంది జగన్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్ష టీడీపీ విమర్శలు కూడా గుప్పిస్తోంది. జగన్ సర్కార్ కు ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడం లో ఉన్న శ్రద్ధ... పాలన చేయడంలో లేదు అంటూ విమర్శలు గుప్పిస్తోంది టిడిపి. 

 


 అంతేకాకుండా వైసిపి రంగుల యవ్వారం కొన్నిసార్లు వివాదాస్పదంగా కూడా మారింది. ఓ చోట పంచాయతీ ఆఫీస్ పై ఉన్న జాతీయ జెండా రంగుని  తొలగించి మరి వైసిపి రంగులు వేయడం తో అది కాస్త వివాదాస్పదమైంది. ఇక చివరికి వైసిపి రంగులు తొలగించి మళ్లీ జాతీయ జెండా రంగులను వేయించారు అధికారులు. అంతేకాకుండా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ రంగుల రగడ కొనసాగుతూనే ఉంది. కాగా  రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఆఫీసులో రంగులు కూడా వైసీపీ జెండా కలర్ లోకి మారిపోయాయి. ఈ నేపథ్యంలో వైసిపి రంగుల వ్యవహారంపై హైకోర్టు స్పందించింది. 

 

 ప్రభుత్వ కార్యాలయాలను అన్నింటికీ  వైసీపీ జెండా రంగులతో ఏపీ సర్కార్ వేయిస్తున్న  విషయం తెలిసిందే. కాగా తాజాగా ఏపీ సర్కార్కు ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడం విషయంలో హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయటం ఏమిటంటు  హైకోర్టు ఏపీ ప్రభుత్వంని నిలదీసింది.  అసలు ఏ ప్రాతిపదికన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేశారు అంటూ ప్రశ్నించినా హైకోర్టు... పదిరోజుల్లో దీనికి సంబంధించి నివేదిక అందించాలని గుంటూరు కలెక్టర్ ఆదేశించింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లెపాడు పంచాయతీ కార్యాలయానికి వైసీపీ జెండా రంగులు వేయడాన్ని నిరసిస్తూ ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... తాజాగా అది విచారణకు వచ్చింది. కాగా  ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి రంగులు వేస్తున్న ఏపీ ప్రభుత్వం తీరును హైకోర్టు తప్పుబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: