ఈరోజుల్లో సిగరెట్ తాగడం ఓ ట్రెండ్ అయిపోయింది. అప్పుడప్పుడే ఎదుగుతున్న చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ సిగరెట్ తాగేస్తున్నారు. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినప్పటికీ కూడా సిగరెట్ మాత్రం తాగకుండా ఉండలేకపోతున్నారు. అయితే తాగితే తాగార్లే  వాళ్ల ఆరోగ్యం వాళ్ళ ఇష్టం అనుకుంటే అయిపోద్ది అంటారా... వారి సిగరెట్ తాగేది పబ్లిక్ ప్లేస్ లో అయితే వారితో పాటు పది మంది ఆరోగ్యం పాడవుతుంది కదా. సిగరెట్ తాగడం వల్ల వాళ్ళకి కాకుండా పక్క వాళ్ళకి కూడా హానికరమే. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ పబ్లిక్ ప్లేసులో సిగిరెట్ కాల్చడం మాత్రం ఆపరు . అయితే సిగరెట్ తాగడం హానికరం అంటూ అటు సినిమాల్లో హెడ్ లైన్ లో కొంచెం హైలెట్గా చూపిస్తారు అయినప్పటికీ అది ఎవరు పట్టించుకోరు. 

 

 సిగరెట్ తాగుటం  మానేయాలి  అంటు  ఎన్ని ప్రచారాలు చేసినా సిగరెట్ తాగి వాళ్ళు మాత్రం అదీ  పెడచెవిన పెట్టేస్తారు. ఇక మరోవైపు పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగుతుంటే పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా... ధూమపానం చేసే వారిలో మాత్రం మార్పు రావడంలేదు. కానీ తాజాగా రోడ్డుపై సిగరెట్ తాగే వారిని అక్కడి స్థానికులు పోలీసులకు పట్టించారు. దీంతో పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపరచగా... కోర్టు ఆ వ్యక్తి కి భారీ షాక్ ఇస్తూ శిక్ష విధించింది. ఇంతకీ ఆ కోర్టు విధించిన శిక్ష ఏమిటో తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే. పబ్లిక్ ప్లేస్ లో మద్యపానం ధూమపానం నిషేధం అన్న విషయం అందరికీ తెలిసినప్పటికీ జనాలు మాత్రం అలాగే పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్లు కాలుస్తూ ఉంటారు. 

 


ఈ క్రమంలోనే మేడిపల్లి ఎన్ఐఎన్  కాలనీకి చెందిన బాల దీపక్... నిన్న రాత్రి ఆరు బయట హాయిగా సిగరెట్ లాగించేశాడు. అయితే ఇది గమనించిన స్థానికులు పెట్రోలింగ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా అక్కడికి చేరుకున్న పోలీసులు అక్కడ సిగరెట్ తాగుతున్న బాల దీపక్ ను  అరెస్ట్ చేశారు.. ఇక ఆ తర్వాత ఎల్బీనగర్ ఫస్ట్ క్లాస్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు అతన్ని  హాజరుపరిచారు. అయితే గతంలో ఆరుబయట ధూమపానం చేసేవారికి 50 రూపాయల చొప్పున ఫైన్ పడేది. ఇప్పుడు కూడా అలాంటి ఫైన్ పడుతుంది అని అతను ధీమాగా ఉన్నాడు. కానీ కోర్టు ఎవరూ ఊహించని విధంగా మూడు రోజుల జైలు శిక్ష విధించింది. దీంతో అతను షాక్ అయ్యాడు. సిగరెట్  తాగిన వ్యక్తి కి జైలు శిక్ష విధించడం నగరంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: