కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి... కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిద్దరామయ్య కు గుండెపోటు రావడంతో బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు సిద్ధమయ్యారు. ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తీవ్ర ఒత్తిడికి లోనైనా మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో సిద్దరామయ్యను  ఆయన కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఆస్పత్రిలో చేర్పించారు.ఇక  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిద్ధరామయ్యను  పరామర్శించేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప నేడు ఆస్పత్రికి వెళ్లారు. కాగా ఆసుపత్రికి కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప సహచర మంత్రులు కొందరితో కలిసి వెళ్లి సిద్దిరామయ్య ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. 

 


 అయితే  ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప వెంట మంత్రులు కెఎస్ ఈశ్వరప్ప బస్వరాజ్ బొంమ్మై  ఉన్నారు. తన తండ్రి సిద్ధరామయ్య చాలా కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు అంటూ సిద్దిరామయ్య కుమారుడు యతేంద్ర  సిద్దిరామయ్య తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఆయన అన్నారు. డాక్టర్ రమేష్ నేతృత్వంలోని వైద్యబృందం తన తండ్రి సిద్దిరామయ్య కు వైద్య పరీక్షలు అందిస్తున్నారని ఆయన తెలిపారు. గుండె సంబంధిత వ్యాధి ఉండటం వల్ల గుండెకు రక్తప్రసరణ సరిగ్గా జరగక గుండెపోటు వచ్చినట్లు వైద్యులు చెప్పినట్లు ఆయన తెలిపారు. 

 


 అయితే సిద్దిరామయ్య ఆరోగ్యంపై డాక్టరు ఇచ్చిన సలహామేరకు సిద్దిరామయ్య కు... ఆంజియోప్లాస్టీ చికిత్స చేయిస్తున్నామంటూ సిద్దిరామయ్య కుమారుడు యతీంద్ర తెలిపారు. కాగా  చికిత్సపొందుతున్న సిద్ధరామయ్య పరామర్శించిన కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప... సిద్దరామయ్య త్వరగా  కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా సిద్దిరామయ్య తాజాగా ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర  కూటమి ఓటమి చవి చూడడం ద్వారా తీవ్ర ఒత్తిడికి లోనవడం వల్ల ఆయనకు ఆకస్మాత్తుగా గుండె పోటు  వచ్చినట్టు తెలుస్తోంది.తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి అఖండ విజయాన్ని సొంతం చేసుకుని... కాంగ్రెస్ ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: