జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అసెంబ్లీకి హాజరయ్యే ముందు సొంత పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలను చేశాడు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన దగ్గర నుంచి... పవన్ కళ్యాణ్ ఆలోచనలకు వ్యతిరేకంగా రాపాక వరప్రసాద్ వ్యవహరిస్తున్నాడు. అవసరమైతే జనసేన పార్టీకి రాజీనామా చేస్తానని కూడా సవాల్ విసురుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నిన్న జరిగినటువంటి రైతు సౌభాగ్య దీక్షకు కూడా రాపాక హాజరు కాలేదు. అసెంబ్లీ సమావేశాల వల్ల రాలేకపోయానని చెప్పినప్పటికీ... జనసేన పార్టీ వరప్రసాద్ పై తీవ్ర ఆగ్రహంగా ఉందని తెలుస్తుంది.

అయితే నిన్నటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ తనని దీక్షకు పిలవలేదని.. పిలవని పేరంటానికి వెళ్లలేని చెప్పారు. అయితే ఈ రోజు తాజాగా జరిగిన మీడియా సమావేశంలో.. పవన్ దీక్షకు రాకపోవడానికి వేరొక కారణాలు ఉన్నాయని చెప్పారు. ఆయన మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమం చేపట్టినా... పది మంది మాత్రమే వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి చిన్న విషయానికి సభలు, నిరసనలు, ధర్నాలు అంటూ చేయడం ఏమాత్రం సరికాదని స్పష్టం చేశారు. దీంతో ఏకైక జనసేన ఎమ్మెల్యే... అధినేత అయిన పవన్ కళ్యాణ్ గురించి ఇలా మాట్లాడడం తో ప్రస్తుతం ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది.


భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ చేసే కార్యక్రమాలకు ఆదరణ పూర్తిగా తగ్గుతుందని రాపాక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో అతను వైసీపీ పార్టీ త్వరలోనే చేరతాడనే ఊహాగానాలు వెల్లువెత్తున్నాయి.ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారోోచూడాలిక.

ఇకపోతే... ఆంగ్ల మాధ్యమం ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టడంపై పవన కళ్యాణ్ తనదైన శైలిలో ట్వీట్ లు చేస్తూ వ్యతిరేకిస్తుంటే... రాపాక మాత్రం జగన్ సర్కార్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నామని నిండు సభలో చెప్పిన విషయం తెలిసినదే. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: