వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొత్తలో నీటి ప్రాజెక్టుల కొరకు 17,500 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పారని కానీ గడచిన ఐదు సంవత్సరాల్లో 67,500 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. కానీ 40 ప్రాజెక్టులలో చంద్రబాబు ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని అన్నారు. అంత ఖర్చు పెట్టినా ప్రాజెక్టులు పూర్తి కాలేదంటే ఏమని అర్థం చేసుకోవాలని అంబటి ప్రశ్నించారు. 
 
అవినీతి నిర్మూలన చేయకపోతే సమాజంలో అభివృద్ధి జరగదని అంబటి అన్నారు. గత ఐదేళ్లలో అవినీతి పరాకాష్టకు చేరిందని అంబటి అన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే అని అంబటి అన్నారు. సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలులోకి తెచ్చారని పారదర్శక పాలనే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని అంబటి అన్నారు. రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిందని అంబటి అన్నారు. 
 
రివర్స్ టెండరింగ్ ద్వారా 1400 కోట్ల రూపాయలు ఆదా అయిందని అన్నారు. ఏ నాయకుడైనా ఇసుక అమ్మితే శిక్షించటానికి సిద్ధంగా ఉన్నామని అంబటి అన్నారు. ఇసుక విధానం తప్పన్నారని ఇసుక విధానం ప్రస్తుతం అమలవుతోందని అన్నారు. మద్యం విధానంలో కూడా సీఎం జగన్ మార్పులు చేశారని చంద్రబాబు తాగుబోతులు తిట్టుకుంటున్నారని చెబుతున్నారని తాగుబోతులు తిట్టుకోవడమే మా విధానమని అంబటి చెప్పారు. 
 
మేం మందు పట్టుకుంటే షాక్ కొట్టేలా రేట్లు పెంచుతామని అధికారంలోకి రాకముందే చెప్పామని అన్నారు. 5 సంవత్సరాల తరువాత మద్యం పూర్తిగా లేకుండా చేయబోతున్నామని అంబటి అన్నారు. చంద్రబాబు చాలా గొప్పవాడని, దేన్నైనా ఎదుర్కోగల శక్తి ఉందని చెబుతారని కానీ చంద్రబాబు తన లోపాలను, తన తప్పులను తెలుసుకోవటం లేదని అన్నారు. టీడీపీ పార్టీ ఎప్పుడైనా సొంతంగా గెలిచిందా అని అంబటి ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిచిన ప్రతిసారి సీపీఐ లేదా ఇతర పార్టీలతో టీడీపీ పొత్తులు పెట్టుకుందని అంబటి చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: