ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ పార్టీ రంగులు ప్రభుత్వ భవనాలకు వేయటాన్ని ఏపీ హైకోర్టు తప్పుబట్టింది. హైకోర్టులో గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి వైసీపీ పార్టీ రంగులు వేయడంపై పిటిషన్ దాఖలు కాగా ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుబట్టింది. వైసీపీ పార్టీ రంగులు ప్రభుత్వ భవనాలకు ఎలా వేశారని ప్రశ్నించింది. 
 
గుంటూరు జిల్లా కలెక్టర్ ను పది రోజుల్లో ప్రభుత్వ భవనాలకు రంగుల గురించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జరీ చేసింది. హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వ భవనాలకు పార్టీల రంగులు వేయడం సరికాదని పేర్కొంది. ప్రభుత్వ భవనానికి పార్టీ రంగులు వేయడం అనే నిర్ణయాన్నే హైకోర్టు తప్పుబట్టింది. ప్రభుత్వ తరపు లాయర్ గతంలో కూడా ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేశారని చెప్పారు. 
 
ఏ పార్టీ రంగులైనా ప్రభుత్వ భవనానికి వేయరాదని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. పల్లపాడు పంచాయతీకి పార్టీ రంగులు వేయడంపై పదిరోజుల్లో కలెక్టర్ నివేదిక ఇవ్వబోతున్నారు. నివేదికను పరిశీలించిన తరువాత కోర్టు పూర్తి స్థాయి విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వనుంది. ఒక వ్యక్తి ప్రభుత్వ కార్యాలయాలకు, పంచాయతీ భవనాలకు రంగులు వేయడం గురించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
పిటిషన్ లో ప్రభుత్వ ఖర్చులతో పార్టీ రంగులను వేయటం ఏమిటని పిటిషనర్ ప్రశ్నించారు. పంచాయతీ భవానానికి రంగులు వేసినట్లు ఫోటోలను, వీడియోలను కోర్టుకు పిటిషనర్ తరపు న్యాయవాది అందించారు. హైకోర్టు కలెక్టర్ ఇచ్చిన నివేదికను పరిశీలించిన తరువాత ఈ కేసులో విచారణ చేయనుంది. వైసీపీ పార్టీ రంగుల వ్యవహారం గురించి హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. వైసీపీ పార్టీకి రంగుల విషయంలో ప్రజల నుండి కూడా కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్న మాట వాస్తవం. 

మరింత సమాచారం తెలుసుకోండి: