తాజాగా దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ కేసు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళలు, చిన్నారులపై నేరాలను అధికమించేదుకు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే కదా. తాజాగా వైఎస్‌ జగన్‌ సర్కార్ ప్రవేశ పెట్టిన  ‘దిశ’ బిల్లును ఏపీ శాసనసభ శుక్రవారం ఆమోదం పలికిన సంగతి అందరికి తెల్సిందే కదా. ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్‌ లా చట్టం 2019, ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగెనెస్ట్‌ వుమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019కి ఆమోద ముద్ర వేయడం జరిగింది. 

 

ఇక ముఖ్యమైన విషయానికి వస్తే  ఏపీ దిశ చట్టం, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చట్టాల్లోని ముఖ్యమైన ముఖ్యాంశాల వివరాలు ఇలా....

 


* గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన  చట్టం ప్రకారం నిర్భయ కేసుల్లో జైలు లేదా మరణదండన  విధిస్తుంటే.. కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం  ‘దిశ’ చట్టం ద్వారా రేప్‌ చేసినవారికి కచ్చితంగా  మరణదండన  శిక్షగా విదిస్తుంది.

 

* అత్యాచార ఘటనలు  మాత్రమే కాకుండా పిల్లలపై లైంగిక వేదింపులు అన్నిటికి  కూడా శిక్షల్ని పెంచడం జరిగింది. ఈ శిక్షల ప్రకారం పిల్లలపై ఇక ఎలాంటి లైంగిక నేరాలకు పాల్పడినా జీవితాంతం జైల్లో గడపడం, లేక ఉరికంబం ఎక్కడమో శిక్షగా నియమించారు.

 

* వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన   నిర్భయ చట్టం ప్రకారం రెండు నెలల్లో దర్యాప్తు పూర్తయితే మరో రెండు నెలల్లో శిక్ష విధించాలి. అంటే మొత్తం 4 నెలల్లో దర్యాప్తు, న్యాయ ప్రక్రియ మొత్తం  పూర్తి అవ్వాలి. దీనిని ఏపీ దిశ చట్టంలో 4 నెలల నుంచి 21 రోజులకు తగ్గించడం జరిగింది. 

 

*ఇక  సోషల్‌మీడియా ద్వారా మహిళలను వేధించడం, వారిపై అసభ్య పోస్టింగులు పెట్టడం లాంటివి చేస్తే ఐపీసీ ప్రకారం ఎలాంటి శిక్షలు తీసుకొని రాలేదు. కానీ ఈ చట్టం ద్వారా – మెయిల్స్‌ ద్వారా గాని, సోషల్‌ మీడియా ద్వారా గాని, డిజిటల్‌ విధానంలోగాని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే మొదటి తప్పుకు రెండేళ్లు, ఆ తర్వాత తప్పుకు 4 ఏళ్లు శిక్ష విధించేలా చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: