హైదరాబాద్ షాద్నగర్ లో జరిగిన దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం  తెలిసిందే. దిశా పై దేశం మొత్తం ఒక్కసారిగా భగ్గుమంది. దిశ కేసులో నిందితులకు ఉరిశిక్ష విధించడంపై చంపాలంటూ దేశ ప్రజానీకం నిరసనలు  పలికింది. దీనికోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. కాగా  చివరికి దిశ కేసులో నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసారు పోలీసులు. ఇదిలా ఉండగా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం సరికొత్త చట్టాన్ని తీసుకురావాలని జగన్ సర్కారు నిర్ణయించింది. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు దిశ చట్టాన్ని తీసుకొచ్చేందుకు నిర్వహించింది .

 


 కాగా  దీనికి సంబంధించిన బిల్లును ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టారు జగన్ సర్కార్. కాగా మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన దిశ యాక్ట్ కి  ఏపీ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సైతం జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ చట్టాన్ని  స్వాగతించారు. దిశా చట్టాన్ని  ప్రవేశపెట్టడమే కాదు ఈ చట్టాన్ని అమలు చేయడం విషయంలో కూడా ప్రభుత్వం ముందుండాలంటు  పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు. అయితే దిశా యాక్ట్ పై అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ప్రశంసలు కురిపించారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టంతో మహిళల్లో తమ భద్రతపై నమ్మకం ఏర్పడింది అని ఆమె అన్నారు. 

 

 హైదరాబాద్లో జరిగిన దిశా ఘటనను పరిగణలోకి తీసుకొని మహిళల భద్రత కోసం దిశా  కొత్త చట్టాన్ని  ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కాగా తన కుమార్తె పేరు మీద ఏపీ సర్కార్ తీసుకువచ్చిన చట్టంపై దిశా  తండ్రి స్పందించారు. మహిళల రక్షణ ఉద్దేశంలో  తన కూతురు పేరుతో దిశ చట్టం తీసుకురావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దిశ చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అంటూ దిశా తండ్రి తెలిపారు.ఇక  దిశ చట్టం అమలులో ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: