ఈ రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. వాదోపవాదాలు విమర్శలు ప్రతి విమర్శలు మధ్య  సభ మొత్తం హాట్ హాట్ గా కనిపిస్తోంది. కాగా  అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మంత్రి కొడాలి నాని పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని.. ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి తీసుకెళ్లి జాయిన్ చేయకపోతే... మనకే ప్రమాదం ఉంటుందంటూ అచ్చెన్నాయుడు సెటైర్లు వేశారు. వైసిపి నేతలు అందరూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ విమర్శలు చేస్తున్నారని... తనపై కేసులు ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకోవాలని... తనకేమీ అభ్యంతరం లేదంటూ అచ్చన్నాయుడు ఆరోపించారు. తాను అందరికంటే కాస్త గట్టిగా మాట్లాడుతాను తప్ప  అసభ్య పదజాలాన్ని మాత్రం ఎప్పుడు వినియోగించ లేదు అంటూ అచ్చన్నాయుడు తెలిపారు. 

 

 

 అధికార పార్టీ సభ్యులు నోటా  తన పేరు తప్ప ఇంకే పేరు రావడం లేదని మీరు చేసిన తప్పులను ఎత్తిచూపుతూ అసెంబ్లీలో మాట్లాడడం నా తప్పా అంటూ ఆయన ప్రశ్నించారు. అయితే మామూలుగానే ఘాటు విమర్శలు చేసే  మంత్రి కొడాలి నాని... అసెంబ్లీలో తనపై అచ్చన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ గట్టిగానే  కౌంటర్ ఇచ్చారు. తను ఎర్రగడ్డలోని పిచ్చాసుపత్రిలో చేర్పించండి అచ్చన్నాయుడు అంటున్నారని...అలా  అయితే అచ్చన్నాయుడు ను  ఏదైనా వెటర్నరీ ఆసుపత్రిలో చేర్పిస్తే మంచిదని కొడాలి నాని సెటైర్ వేశారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మానసిక వైకల్య కేంద్రాన్ని ఇచ్చినట్లు సభ్యులు శ్రీకాంత్ రెడ్డి చెప్తే విన్నానని... ఆసుపత్రిని శ్రీ నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్యం కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని  కోరుకుంటున్నానని మంత్రి కొడాలి నాని సెటైర్లు విసిరారు. 

 


 మానసిక వైకల్య కేంద్రాన్ని అమరావతిలో ఏర్పాటు చేసి అందులో మొదటి పేషెంట్ గా  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని... రెండవ పేషంట్ గా పిచ్చెక్కి తిరుగుతూ మార్షల్స్ ను  కొడుతున్న వాళ్లను ఆసుపత్రిలో చేర్పిస్తే బాగుంటుంది అంటూ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. అయితే మంత్రి కొడాలి నాని మాట్లాడుతున్నంత సేపు అధికార పార్టీ సభ్యులందరూ బల్లలు చరుస్తూ విరగబడి నవ్వుకున్నారు. అసెంబ్లీ మొత్తం వాడివేడిగా వాదోపవాదాలు ప్రశ్నోత్తరాల తో కొనసాగుతూనే ఉంది. అధికార విపక్ష పార్టీల మధ్య ప్రశ్నోత్తరాల, విమర్శలు ప్రతివిమర్శలు  ఘాటుగా కొనసాగుతుండడంతో సభ మొత్తం వాడివేడిగా ముందుకు సాగుతుంది. కాగా నేడు ఏపీ అసెంబ్లీ దిశ చట్టానికి ఆమోద ముద్ర వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: