తాజాగా పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత జనవరిలో  పసుపు రైతులకు శుభవార్త తెలుపుతాము అని  నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ తెలియచేయడం జరిగింది. మేము  పసుపు బోర్డును మించిన ప్రయోజనాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాము అని తెలియచేయడం జరిగింది. ఇంకా అరవింద్‌ మాట్లాడుతూ.. "అరవింద్‌ గట్టి నెగోషియేటర్‌ అన్న విషయం కచ్చితంగా నిరూపిస్తాను" అని తెలిపారు. ఇప్పటికే విదేశాల నుంచి పసుపు దిగుమతులు నిలిపివేయాలని మంత్రులకు తెలియాచేయడం జరిగింది అని తెలిపారు అరవింద్. ఇందుకు కేంద్రం కూడా  ఒప్పుకోవడం జరిగింది అని తెలిపారు.

 


వాస్తవానికి పసుపు జాతీయ స్థాయిలో సాగు చేసే పంట కాదు. అయినా కూడా సరే పసుపు పంటకు మద్దతు ధర కల్పించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది అని తెలిపారు అరవింద్. కానీ ఇలా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు కచ్చితంగా కావాలి అని తెలిపారు. ఇందుకు తగ్గ ప్రయత్నాలు కూడా చేస్తున్నాము అని తెలిపారు. ఇవ్వని ఎలా ఉన్న సరే కచ్చితంగా  పసుపు  రైతులకు మంచి శుభవార్త తెలుపుతాము అని ఎంపీ ధర్మపురి అరవింద్‌ తెలియాచేయడం జరిగింది.

 


కానీ ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం పసుపు మద్దతు ధరపై ఎలాంటి ప్రతిపాదనలు పంపించ లేదు అని తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్‌ కేటాయించాలని హెచ్‌ఆర్డీ మంత్రిని కోరడం జరిగింది. దీనికి మంత్రి కూడా ప్రతి కులంగా స్పందించడం జరిగింది. ఇక పార్లమెంట్‌ సమావేశాలు  చివరి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది అని తెలిపారు.  తెలంగాణలో ఏర్పడేది బీజేపీ సర్కారే అని కేంద్ర నాయకత్వం బాగా నమ్ముతుంది అని తెలియచేయడం జరిగింది. పసుపు రైతుల కష్టాలు, మద్దతు ధరపై  చర్చ చేసేందుకు కేంద్రమంత్రులు అమిత్‌ షా, పియూష్‌ గోయల్‌ను కలవడం జరిగింది. ఈ సందర్భంగా విదేశాల నుంచి పసుపు దిగుమతి నిలిపివేసి పసుపు రైతులను ఆదుకోవాలి అని   కేంద్రమంత్రులను అరవింద్‌  కోరడం జరిగింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: