ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని రగడ తెరమీదికి వచ్చింది. ఏపీ రాజధాని అమరావతిని తాత్కాలిక రాజధానిగా మాత్రమే నిర్మించారని... రాష్ట్రం  అభివృద్ధి చేయాలంటే మార్పు తప్పనిసరి అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఏపీ రాజధాని మార్పు పై విషయం సరైనది కాదు అంటూ ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. రాజధాని మార్పు చేయడం వల్ల ప్రజాధనం వృధా అవుతుందని.. రాజధాని మార్పు నిర్ణయాన్ని విరమించుకోవాలని అంటూ విమర్శలు గుప్పించారు. అయితే రాజధాని మార్పు పై మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం పలుమార్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 

 

 ఇక తాజాగా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజధాని అంశంపై అటు ప్రజలు ఇటు నేతల్లో  నెలకొందని దీనిపై స్పష్టత ఇవ్వాలని టీడీపీ నేతలు అడగ్గా ...  రాజధాని మార్పు ఉండదని... కేవలం రాజధాని అభివృద్ధి జరగలేదని మాత్రమే ఒకప్పుడు తన వ్యాఖ్యానించానని అన్నానని... మార్పు చేస్తానని వ్యాఖ్యానించ లేదని ప్రతిపక్ష పార్టీ నేతలు తన వ్యాఖ్యలను తప్పుపట్టారు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి రాజధాని మార్పు అంశం అసెంబ్లీలో చర్చకు వచ్చింది. ఏపీ రాజధాని అమరావతిని మార్పు విషయంలో లిఖిత పూర్వక స్పష్టత ఇవ్వాలంటూ అసెంబ్లీలోని టీడీపీ సభ్యులు అందరూ వైసీపీ ప్రభుత్వాన్ని కోరారు. 

 

 తాజాగా మరోసారి ఏపీ రాజధాని మార్పు పై క్లారిటీ ఇచ్చినది  జగన్ సర్కార్. రాజధాని విషయంలో టీడీపీ సభ్యుల ప్రశ్నలపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ... రాజధాని అమరావతి లోనే ఉంటుందని అమరావతిని అభివృద్ధి చేసుకుందామని... లిఖితపూర్వకంగా తెలిపారు. రాజధాని అమరావతి ఎక్కడికి  తరలించడం లేదంటూ స్పష్టం చేశారు. మంత్రి బొత్స లిఖితపూర్వక ప్రకటనతో ఇన్ని రోజుల్లో రాజధాని మార్పు అంటూ వస్తున్న వార్తలన్నిటికి  తెరపడింది. దీంతో అటు ప్రజలకు ఇటు నేతలకు రాజధాని మార్పు లేదని అమరావతిలోని రాజధాని అభివృద్ధి చేస్తామంటూ జగన్ ప్రభుత్వం తెలపడంతో క్లారిటీ వచ్చినట్లయింది. అంతేకాకుండా తాను ఎక్కడ రాజధాని మార్పు చేపడతాము  అని వ్యాఖ్యానించ లేదని తన వ్యాఖ్యలను విపక్ష నేతలు తప్పు పట్టారు అంటూ మంత్రి బొత్స స్పష్టం చేసారు .

మరింత సమాచారం తెలుసుకోండి: