నేటి అసెంబ్లీ సమావేశం మొత్తం రసాభాసగా సాగింది. మార్షల్స్  పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దుర్భాషలాడటం... అంతేకాకుండా లోకేష్ మార్షల్స్ పై  చేసుకున్నాడంటూ అసెంబ్లీ వేదికగా వైసిపి సభ్యులందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నేడు అసెంబ్లీలో మొత్తం మార్షల్స్  పై చంద్రబాబు దుర్భాషలాడటం పైన  చర్చ కొనసాగింది. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు  మార్షల్  పై చంద్రబాబు దుర్భాషలాడటం అసెంబ్లీలో వైసీపీ సభ్యులందరూ విరుచుకుపడ్డారు. అటు ఈ సంఘటనపై చంద్రబాబు నాయుడు కూడా ఘాటుగానే బదులిచ్చారు. దీంతో అసెంబ్లీ సమావేశం రసాభాసగా సాగింది. 

 

 అయితే మార్షల్స్  పై దుర్భాషలాడాను అంటూ తనపై వస్తున్న ఆరోపణలపై టిడిపి అధినేత ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు . మంగళగిరిలో ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను చంద్రబాబునాయుడు ఖండించారు. అసెంబ్లీలో అంత జరుగుతున్న... అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం బాధ్యత లేకుండా పద్ధతి లేకుండా వ్యవహరించారు అంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తించిన స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఇదేం హుందాతనం అంటూ ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు. 

 

 

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైయస్ జగన్మోహన్ రెడ్డి కి కనీసం అనుభవం లేదని... కానీ గర్వం  మాత్రం చాలా ఉందని... ఒళ్లంతా కొవ్వు కూడా ఉంది అంటూ చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంబోతులాగా అసెంబ్లీలో ఎగిరెగిరి పడుతున్నాడు  అంటూ జగన్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మార్షల్స్ పై తాను  దుర్భాషలాడాను  అంటూ వైసీపీ నేతలు అందరూ తనపై విమర్శలు గుప్పిస్తున్నారు... అయితే తాను మార్షల్స్ పై  దుర్భాషలాడినట్టు ఎలాంటి ఎవిడెన్స్  లేదని... దీంతో కొంతమంది ఉద్యోగుల నుంచి వైసిపి నేతలు  స్టేట్మెంట్స్ తీసుకున్నారంటూ చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. అంతే కాకుండా ప్రతి రోజు అసెంబ్లీ సమావేశం అనంతరం చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి వైసిపి నేతలపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: