ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి రోజు నుంచి సభలో రసాభాస నెలకొంటుంది. ప్రశ్నోత్తరాలు వాదోపవాదాలు విమర్శలు ప్రతి విమర్శలు మధ్య సభ మొత్తం హాట్ హాట్ గానే కొనసాగుతోంది. అయితే నేటి అసెంబ్లీ సమావేశం కూడా వాడివేడిగా జరిగింది. మార్షల్స్  పై చంద్రబాబు నాయుడు దుర్భాషలాడటం పై.. వైసిపి సభ్యులు అందరూ చంద్రబాబు నాయుడు పై విరుచుకుపడ్డారు . ఇదిలా ఉంటే గత మూడు రోజుల నుండి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన అనంతరం ప్రెస్ మీట్ పెట్టి జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. 

 

 

 

 నేడు అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత మరోసారి ప్రెస్ మీట్ పెట్టి జగన్ సర్కార్ ఘాటు విమర్శలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మంగళగిరిలో ఈరోజు విలేకరులతో మాట్లాడిన చంద్రబాబు... అసెంబ్లీలో అందరూ తన జపం చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో వైసీపీ సభ్యులు కూడా తన పేరు తీయకుండా మాట్లాడడం లేదని చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతలు అందరూ రామ జపం వదిలిపెట్టి నా జపం చేస్తున్నారు అంటూ చంద్రబాబు అన్నారు. వైసిపివీ  అన్ని హుందాతనం లేని విషయాలు... కక్షసాధింపు చర్యలు అంటు  చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైసీపీకి రాష్ట్ర ప్రజలందరూ ఓట్లు వేసి అధికారాన్ని కట్టబెట్టింది కక్ష సాధింపు చర్యలు చేపడతారని కాదని గుర్తుంచుకోవాలి అంటూ చంద్రబాబు నాయుడు హితవు  పలికారు. 

 

 

 

 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి మంచి చేయకుండా కేవలం మాటలతోనే జగన్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని విమర్శించారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టులో  రివర్స్ టెండరింగ్ పేరిట ఐదారు  కంపెనీలకు కాంట్రాక్టులు ఇస్తూ.. దానిని జగన్ ప్రభుత్వం పారదర్శకత అని చెప్పుకుంటున్నది  అంటూ జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు అందరూ తప్పుడు పనులు చేసుకుంటూ... బయటకి మాత్రం పెద్దమనుషుల లాగా చెలామణి అవుతున్నారని విమర్శించారు చంద్రబాబు. అంతేకాకుండా అసెంబ్లీ స్పీకర్ గా  ఉన్న తమ్మినేని సీతారాం కి కనీస బాధ్యత కూడా లేదని చంద్రబాబు విమర్శించారు. ఈ సందర్భంగా జగన్ పై కూడా విమర్శలు చేశారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: