దిశ హత్యాచారం తర్వాత  ఏపి అసెంబ్లీలో పాసైన బిల్లు విషయంలో నేషనల్ మీడియా జగన్మోహన్ రెడ్డికి శాల్యూట్ చేసింది. దిశ హత్యాచారం లాంటిది రాష్ట్రంలో పునరావృతం కాకుండా ఉండేదుకు జగన్ అసెంబ్లీలో ఓ బిల్లు ప్రవేశపెట్టారు. దాని ప్రకారం నిందితులకు కేవలం 21 రోజుల్లోనే శిక్షలు పడుతుంది. అందులోను శిక్ష కూడా మామూలుది కాదు. సాక్ష్యాధారాలతో  సహా నిరూపితమైతే ఏకంగా మరణశిక్షే విధించేట్లుగా బిల్లు తయారైంది.

 

మహిళలు, పిల్లలపై జరిగే అత్యాచారాలు, హత్యాచారాల విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా ఉంటుందంటూ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. సరే కారణాలు ఏవైనా దిశ యాక్ట్-2019 ను అసెంబ్లీ ఏకగీవ్రంగా ఆమోదించింది. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కూడా సంపూర్ణంగా మద్దతు పలికారు.

 

ఇదే విషయమై నేషనల్ చానెల టైమ్స్ నౌ పెద్ద దిబేటే నిర్వహించింది. పనిలో పనిగా జగన్ తీసుకున్న సాహసోపేతమైన చర్యకు హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసించింది. ఇదే విషయమై చానల్ సోనాల్ మాన్ సింగ్ అనే ఎంపితో టెలిఫోన్లో మాట్లాడించింది. సోనాల్ ఫోన్లో చానల్ ప్రతినిధితో మాట్లాడుతూ జగన్ చేసిన ఇటువంటి చట్టం దేశవ్యాప్తంగా ఎంతో ప్రశంసార్హమైనదన్నారు.

 

జగన్ చేసిన ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని దేశంలోని మిగిలిన రాష్ట్రాలు కూడా అనుసరించాలంటూ డిమాండ్ చేయటం గమనార్హం. ఆడవాళ్ళు, చిన్నపిల్లలపై జరిగే అత్యాచారాలు, హత్యాచారాలను నిరోధించేందుకు జగన్ తీసుకున్న నిర్ణయంపై ఎంపి అభినందనలు తెలిపారు. ప్రభుత్వాలు తీసుకునే ఇటువంటి చర్యలే అత్యాచారాల నిరోధానికి ఎంతగానో ఉపయోగపడతాయని సోనాల్ అభిప్రాయపడ్డారు.

 

నేషనల్ చానల్ లాగే రాష్ట్రంలోని మహిళలు, మహిళా సంఘాలు, విద్యార్ధినులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు.  మొత్తానికి దిశ హత్యాచారం ఘటన జరిగింది తెలంగాణాలో అయినా  ఏపిలో  వెంటనే చట్టం చేయటం మాత్రం విచిత్రంగానే ఉంది. ఎందుకంటే ఇటువంటి చట్టం చేసే విషయంలో తెలంగాణా ప్రభుత్వం నుండి మాత్రం సానుకూల స్పందన ఇంత వరకు బయటపడలేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: